మహిళల నియామకాల్లో నావికా దళం మరో ముందడుగు వేసింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ మహిళా అధికారులకు యుద్ధనౌకల్లో స్థానం కల్పించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నావికా దళం సోమవారం వెల్లడించింది.
"ఇటీవల కాలంలో నలుగురు మహిళా అధికారులను యుద్ధనౌకల్లో నియమించాము. అందులో ఇద్దరు ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో, మరో ఇద్దరు ఐఎన్ఎస్ శక్తిలో సేవలు అందిస్తున్నారు."
-భారత నావికా దళం
ఐఎన్ఎస్ శక్తిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా అధికారుల్లో ఓ డాక్టరు ఉన్నారు. పురుషులతో సమానంగా సేవలు అందిస్తామని మహిళా అధికారులు తెలిపారు.
1998లో..
యుద్ధనౌకల్లో మహిళా అధికారుల నియామకాన్ని నావికా దళం 1998లోనే ప్రారంభించింది. కానీ కొంత కాలానికే నిలిపివేసింది.
డిఫెన్స్ అటాచీ కింద విదేశాల్లో దౌత్యసేవలు అందించే బాధ్యతలను నేవీ ఇటీవల ఓ మహిళా అధికారికి అప్పగించింది. లెఫ్టినెంట్ కమాండర్ కరాబీ గొగొయిని రష్యా రాజధానిలో నావెల్ అటాచీగా నావికా దళం నియమించింది.
ఇదీ చూడండి : అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే గుర్రపు స్వారీ