ETV Bharat / bharat

20 కి.మీ.ల మేర 100 గుంతలు.. సర్కార్​పై విమర్శలు.. ఇదీ అక్కడి హైవే దుస్థితి! - కర్ణాటక హైకోర్టు

Bihar Potholes: బిహార్​లోని జాతీయ రహదారి 227కు సంబంధించిన ఓ వీడియా సామాజిక మధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ రోడ్డుపైన సుమారు 100 భారీ గుంతలు కనిపిస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపైపు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త పీకే ఈ వీడియోను ట్వీట్​ చేస్తూ 1990ల నాటి జంగిల్‌ రాజ్‌ పాలనను బిహార్​ రోడ్లు గుర్తు తెస్తున్నాయని అన్నారు.

bihar potholes
bihar potholes
author img

By

Published : Jun 25, 2022, 12:23 PM IST

Updated : Jun 25, 2022, 4:21 PM IST

20 కి.మీ.ల మేర 100 గుంతలు.. సర్కార్​పై విమర్శలు.. ఇదీ అక్కడి హైవే దుస్థితి!

Bihar Potholes: బిహార్‌లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న నేపథ్యంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ రాష్ట్రంలోని మధుబనీ జిల్లా జాతీయ రహదారి 227.. సుమారు 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఆ రోడ్డుపైన సుమారు 100 భారీ గుంతలు ఉన్నాయి. ఇంటింటికో స్విమ్మింగ్​ పూల్​ ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే రోడ్లపైనే చిన్నపాటి కుంటలు వెలిశాయా? అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​పై విమర్శలు గుప్పిస్తున్నారు.

"ప్రతిరోజు ఈ రహదారి గుండా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వెళుతుంటారు.. జిల్లా మేజిస్ట్రేట్‌లు కూడా ఈ రోడ్డుపైనే ప్రయాణాలు చేస్తుంటారు. కానీ, ఎవ్వరూ పట్టించుకోరు. ఏడేళ్లుగా ఈ రోడ్డు ఇదే దుస్థితిలో ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటే నదిలో వెళ్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి 20 అడుగులకు ఒక గొయ్యి కచ్చితంగా ఉంటుంది"

-- రాం ప్రసాద్​, స్థానికుడు

"రూ.28 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారి మరమ్మతు పనులు 2020లో ప్రారంభించాం. అయితే ఆ తర్వాత ముడి సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పోనీ డబ్బులు పెట్టి పనులు చేయిద్దామనుకున్నా.. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. అందువల్ల కూలీలకు రోజువారీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది"

--రవీంద్ర కుమార్​, కాంట్రాక్టర్

'జంగిల్​ రాజ్​ పాలనను గుర్తుతెస్తున్నాయి'.. బిహార్‌ రోడ్లు 1990ల నాటి జంగిల్‌ రాజ్‌ పాలనను గుర్తు తెస్తున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. రాష్ట్ర సీఎం నితీశ్‌ కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు బిహార్​లో పర్యటిస్తున్న పీకే.. జాతీయ రహదారి వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 'జంగిల్‌ రాజ్‌ ఆఫ్‌ 1990స్‌' అని కామెంట్‌ చేశారు. '1990ల్లో బిహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన సతీమణి రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005లో నితీశ్‌ అధికారంలోకి వచ్చారు. అయినా.. అప్పటి, ఇప్పటి పాలనలో పెద్దగా తేడా ఏమి లేదని' గుర్తు చేసేలా పీకే ఈ ట్వీట్‌ చేశారు.

bihar potholes
బిహార్​ జాతీయ రహదారి 227

'ప్రధాని వస్తేనే రోడ్లు బాగు చేస్తారా?' ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం.. రోడ్ల మరమ్మత్తులు, రహదారుల విస్తరణ, ఇతర సౌకర్యాల ఇటీవల కోట్లు ఖర్చు చేసి తీవ్ర విమర్శలపాలైంది బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ). ఇప్పుడు ఈ విషయంపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. 'ప్రధాని, రాష్ట్రపతి వంటి వారు వస్తేనే రోడ్లు బాగు చేస్తారా? లేకపోతే పట్టించుకోరా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రూ. 23కోట్లతో 14కిలోమీటర్ల మేర రోడ్లు, ఇతర మరమ్మతులు చేశారు బీబీఎంపీ అధికారులు. సోమవారం.. ప్రధాని మోదీ పర్యటించిన రోజు అద్దంలా మెరిసిన రోడ్లు.. బుధవారం నాటికి నామరూపం లేకుండా పోయాయి. ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కడం వల్ల.. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం తారు రోడ్డు మరమ్మతులపై సమగ్ర నివేదిక అందజేయాలని బీబీఎంపీని కోరింది.

ఇవీ చదవండి: భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?

దోస్త్​పై పరువునష్టం దావా.. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్​.. అదే కారణమా?

Last Updated : Jun 25, 2022, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.