Advani On Ram Mandir : అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధాని మోదీని ఎంచుకొందని బీజేపీ దిగ్గజ నేత L.K అడ్వాణీ అన్నారు. ప్రముఖ సాంస్కృతిక మాసపత్రిక "రాష్ట్ర్ ధర్మ్" ప్రత్యేక సంచికకు ఆయన వ్యాసం రాశారు. రామ మందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నం పూర్తి కావడంగా అందులో పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం 33 ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. 1990 సెప్టెంబర్ 25 నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదని అడ్వాణీ అన్నారు.
ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్టు అడ్వాణీ తెలిపారు. శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఆ భక్తుడైన మోదీని ఆనాడే ఎంచుకున్నాడని పేర్కొన్నారు. వ్యాసంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీని కూడా అడ్వాణీ గుర్తు చేసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు తెలుస్తోందని చెప్పారు. 'రథయాత్రలోని ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేశాయి. మారుమూల గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురై మొక్కుతూ రామ నామం తలుచుకునేవారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కల. ఇన్నాళ్లు అణిచి పెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి 22న నెరవేరబోతున్నాయి. ఇందుకు ప్రధాని మోదీని అభినందిస్తున్నా' అని ఆడ్వాణీ తన వ్యాసంలో పేర్కొన్నారు.
రామాలయం ఓపెనింగ్‌కు రాష్ట్రపతికి ఆహ్వానం
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు రావాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసిన ప్రతినిధి బృందంలో వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్‌కుమార్, ఆరెఎస్ఎస్ నేత రామ్‌లాల్, రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్ర ఉన్నారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ రాష్ట్రపతి ఆహ్వాన పత్రికను అందుకొంటున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎంతో సంతోషం వ్యక్తం చేసిన ద్రౌపదీ ముర్ము అయోధ్యను సందర్శించే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపినట్లు బన్సల్ పేర్కొన్నారు.
-
आज भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को 22 जनवरी को श्री राम मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण सौंपा। उन्होंने इस पर अत्यंत हर्ष व्यक्त किया तथा कहा कि अयोध्या आने व दर्शन करने का शीघ्र समय तय करेंगी।
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
इस अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल… pic.twitter.com/ceO6Gwuvbc
">आज भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को 22 जनवरी को श्री राम मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण सौंपा। उन्होंने इस पर अत्यंत हर्ष व्यक्त किया तथा कहा कि अयोध्या आने व दर्शन करने का शीघ्र समय तय करेंगी।
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 12, 2024
इस अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल… pic.twitter.com/ceO6Gwuvbcआज भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को 22 जनवरी को श्री राम मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण सौंपा। उन्होंने इस पर अत्यंत हर्ष व्यक्त किया तथा कहा कि अयोध्या आने व दर्शन करने का शीघ्र समय तय करेंगी।
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 12, 2024
इस अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल… pic.twitter.com/ceO6Gwuvbc
'గుడి నిర్మాణం పూర్తి కాకముందే ప్రతిష్ఠాపన మహాపాపం- శంకరాచార్యుల సూచన పట్టించుకోరా?'
'రాముడి కోసం 11 రోజులు దీక్ష'- ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో మోదీ ఎమోషనల్