ETV Bharat / bharat

'దేశంలో 44% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు'.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే? - ఏడీఆర్​ క్రిమినల్​ కేసులు

దేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) వెల్లడించింది. ఇందులో 28 శాతం శాసనసభ్యులపై తీవ్రమైన నేరాలున్నాయని ప్రకటించింది.

adr
adr
author img

By

Published : Jul 15, 2023, 6:42 PM IST

దేశంలోని 44 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పని చేస్తున్న ప్రముఖ ఎన్జీవో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ (ADR), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (NEW) సంస్థలు సంయుక్త నివేదికలో వెల్లడించాయి. 28 శాసనసభలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,033 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం 4,001 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను ప్రకటించింది. ప్రస్తుత ఎమ్మెల్యేల స్వీయ ప్రమాణ పత్రాల్లో వారే ఈ విషయాలను పేర్కొన్నారని వెల్లడించింది. పరిశీలించిన మొత్తం 4వేల ఒక్క ఎమ్మెల్యేల్లో 1,136 మందిపై హత్య.. కిడ్నాప్‌ హత్యాయత్నం వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ఇది దాదాపు 28 శాతం మంది మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారని తెలిపింది.

కేరళలో 95 మంది..
కేరళలో 135 మంది ఎమ్మెల్యేల్లో 95 మంది అంటే 70 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. బిహార్‌లో 242 ఎమ్మెల్యేల్లో 161 మందిపై, దిల్లీలో 70 మంది ఎమ్మెల్యేల్లో 44 మందిపై, మహారాష్ట్రలో 284 మంది ఎమ్మెల్యేల్లో 175 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో 72 మంది ఎమ్మెల్యేలపై తమిళనాడులో 134 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం 114 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వారిలో 14 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు ADR నివేదిక తేల్చింది.

దిల్లీలో 37 మంది.. బిహార్​లో 122 మంది..
దిల్లీలో 70 మంది ఎమ్మెల్యేల్లో 37 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండగా.. బిహార్‌లో 242 మంది ఎమ్మెల్యేలలో 122 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్రలో 284 మంది ఎమ్మెల్యేల్లో 114 మందిపై.. తెలంగాణలో 118 మంది ఎమ్మెల్యేల్లో 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది.

ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి ఎంతంటే?
ఎమ్మెల్యేల క్రిమినల్ రికార్డులతో పాటు ఆస్తులను కూడా ADR, NEW విశ్లేషించాయి. దేశంలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు 13.63 కోట్ల రూపాయలుగా గుర్తించారు. క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.11.45 కోట్లు కాగా క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల సగటు ఆస్తి 16.36 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి 64.39 కోట్ల రూపాయలు ఉండగా తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఏపీలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి 28.42 కోట్లు..
ఏపీలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి 28.42 కోట్ల రూపాయలని ఏడీఆర్‌ పేర్కొంది. త్రిపురలో అతి తక్కువగా ఎమ్మెల్యేల సగటు ఆస్తి కోటి రూపాయల 54 లక్షలుగా ఉంది. 4,001 మంది ఎమ్మెల్యేలలో 88 మంది వంద కోట్లకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారని తేలింది. కర్ణాటకలో 32 మంది ఎమ్మెల్యేలకు వంద కోట్లకుపైగా ఆస్తులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 10 మందికి వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ADR నివేదిక తెలిపింది. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కూడా 100 కోట్లకు పైగా ఆస్తులున్న ఎమ్మెల్యేలు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.