Adipurush Controversy : ఆదిపురుష్ సినిమాలో ముఖ్యమైన పాత్రలను సరిగా చూపించలేదని ఆరోపిస్తూ చిత్ర దర్శకుడిపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు నిప్పులు చెరిగారు. రామయణంలో కీలకమైన హనుమంతుడి పాత్ర రూపకల్పనపై మండిపడ్డారు. సినిమాలో హనుమంతుడి భాష హుందాగా లేదని.. అల్లరి మూకలు మాట్లాడుకునే విధంగా చిత్రీకరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంపై ఆలోచిస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం పేర్కొన్నారు. మరోవైపు, బీజేపీ నేతలు సైతం సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
'లంకా దహనం' సన్నివేశంలో హనుమంతుడి సంభాషణలు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ సుప్రియా శ్రీనేత్ మండిపడ్డారు. అలాంటి పదాలను ఎలా ఉపయోగించారంటూ ప్రశ్నించారు. 'ఆదిపురుష్‌లో ఉపయోగించిన భాష అమర్యాదపూర్వకంగా ఉంది. హనుమంతుడు గంభీర్యానికి చిహ్నంగా కొలుచుకుంటాం. రామానంద్ సాగర్ 1987లో 'రామాయణ్' ధారావాహిక తెరకెక్కించారు. ఆయన అప్పుడు కోట్లాది మంది ప్రజలను మెప్పించారు' అని సుప్రియా శ్రీనేత్ చేశారు.
మరోవైపు, రాయ్‌పుర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. ఈ చిత్రం రాముడు, హనుమంతుడి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఈ సినిమాపై నిషేధం విధిస్తారా.. అన్న ఓ విలేకరి ప్రశ్నకు 'ప్రజలు డిమాండ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం' అని సీఎం బదులిచ్చారు. ఎప్పుడూ హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆదిపురుష్‌లో సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. తులసీదాస్ రామాయణంలో శ్రీ రాముడిని 'మర్యాద పురుషోత్తముడు'గా చూపించారని గుర్తు చేశారు.
-
The dialogue writer of Adipurush @manojmuntashir as well as the director should apologise to the nation for the pedestrian dialogues written for the movie, especially for Lord Hanuman. It hurts every Indian’s sensibilities to see the kind of language being attributed to our…
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The dialogue writer of Adipurush @manojmuntashir as well as the director should apologise to the nation for the pedestrian dialogues written for the movie, especially for Lord Hanuman. It hurts every Indian’s sensibilities to see the kind of language being attributed to our…
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 17, 2023The dialogue writer of Adipurush @manojmuntashir as well as the director should apologise to the nation for the pedestrian dialogues written for the movie, especially for Lord Hanuman. It hurts every Indian’s sensibilities to see the kind of language being attributed to our…
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 17, 2023
'సారీ చెప్పాలి'
'సినిమాలో ఉపయోగించిన సంభాషణల పట్ల డైలాగ్స్ రైటర్ మనోజ్ ముంతశిర్, చిత్ర దర్శకుడు ఓం రౌత్.. రామ భక్తులకు క్షమాపణలు చెప్పాలి' అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. 'సినిమా విజయం సాధించాలన్న ఆలోచనతో.. హిందువులు ఎంతో భక్తితో పూజించుకునే దేవుళ్లకు అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం సరైంది కాదు' అని ఆమె ట్వీట్ చేశారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిపురుష్ సినిమా హిందూ సమాజానికి అవమానకరం అని.. ఈ చిత్రాన్ని తీసేందుకు బీజేపీనే అనుమతించిందని ఆరోపించారు. అలాగే సినిమా విడుదలకు అనుతించినందుకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ముఖ్య నాయకులు, ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రుల మద్దతుతోనే ఈ సినిమా రూపొందిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ బహిరంగంగానే సీతారాములను, హనుమంతుడిని అవమానపర్చినందున తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
నిషేధం విధించండి: బీజేపీ నేత
మరోవైపు, ఆదిపురుష్ సినిమాపై తాత్కాలికంగా నిషేధం విధించాలని దిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ డిమాండ్ చేశారు. చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలు, సంభాషణలపై సెన్సార్ బోర్డు పునఃపరిశీలన చేసేవరకు ఆదిపురుష్ ప్రదర్శనను నిలిపివేయాలని సూచించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరుతూ ట్వీట్ చేశారు.
-
माननीय @ianuragthakur जी
— Praveen Shankar Kapoor (@praveenskapoor) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
फिल्म #आदिपुरुष का हर ओर विरोध हो रहा है
अतः निवेदन है की इसके विवादित दृश्य एवं डायलॉगों की पुनः समीक्षा की जाये@FilmCensorBoard इस फिल्म का सेंसर सर्टिफिकेट अस्थाई रूप से निलंबित करे - इसके प्रदर्शन पर पुनः समीक्षा तक रोक लगे।@VHPDigital…
">माननीय @ianuragthakur जी
— Praveen Shankar Kapoor (@praveenskapoor) June 17, 2023
फिल्म #आदिपुरुष का हर ओर विरोध हो रहा है
अतः निवेदन है की इसके विवादित दृश्य एवं डायलॉगों की पुनः समीक्षा की जाये@FilmCensorBoard इस फिल्म का सेंसर सर्टिफिकेट अस्थाई रूप से निलंबित करे - इसके प्रदर्शन पर पुनः समीक्षा तक रोक लगे।@VHPDigital…माननीय @ianuragthakur जी
— Praveen Shankar Kapoor (@praveenskapoor) June 17, 2023
फिल्म #आदिपुरुष का हर ओर विरोध हो रहा है
अतः निवेदन है की इसके विवादित दृश्य एवं डायलॉगों की पुनः समीक्षा की जाये@FilmCensorBoard इस फिल्म का सेंसर सर्टिफिकेट अस्थाई रूप से निलंबित करे - इसके प्रदर्शन पर पुनः समीक्षा तक रोक लगे।@VHPDigital…
మరోవైపు, 'రామాయణ్' ధారావాహిక దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు మోతీ సాగర్ ఈ సినిమాపై స్పందిస్తూ.. 'ఆదిపురుష్' వంటి ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నప్పడు చిత్రబృందం ఎంతో జాగ్రత్త వహించాలి అని సలహా ఇచ్చారు. వివాదం నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ శుక్లా స్పందించారు. తాను ఎంతో శ్రద్ధ పెట్టి డైలాగ్స్ రాసినట్లు Adipurush Controversy :చెప్పారు. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించానని ఆయన సమాధానం ఇచ్చారు.