ETV Bharat / bharat

'అల్లోపతిలో కరోనిల్‌ చేరితే అది.. మిక్సోపతి'

కరోనా కిట్​లో కరోనిల్​ ఔషధం చేర్చడం ఆమోదయోగ్యం కాదని భారత వైద్య సమాఖ్య పేర్కొంది. అలా చేస్తే అది మిక్సోపతి అవుతుందంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ నిర్ణయంపై ఐఎంఏ ఎద్దేవా చేసింది.

కరోనా కిట్​లో కరోనిల్‌
Adding Coronil To Covid Kits Is "Mixopathy
author img

By

Published : Jun 6, 2021, 6:35 AM IST

Updated : Jun 6, 2021, 6:59 AM IST

యోగా గురు బాబా రామ్‌దేవ్‌ ప్రమోట్‌ చేసే పతంజలి రూపొందించిన 'కరోనిల్‌'ను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కరోనా కిట్‌లో చేర్చింది. దీనిపై ఆ రాష్ట్ర 'భారత వైద్య సమాఖ్య(ఐఎంఏ)' విభాగం తీవ్ర స్థాయిలో మండిపడింది. అల్లోపతి ముందులు ఉండే కరోనా కిట్‌లో ఆయుర్వేదానికి చెందిన 'కరోనిల్‌'ను చేర్చడం ద్వారా అది 'మిక్సోపతి' అవుతుందంటూ ఎద్దేవా చేసింది.

కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం లభించలేదని ఈ సందర్భంగా ఐఎంఏ గుర్తుచేసింది. కేంద్ర మార్గదర్శకాల్లో సైతం ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.

కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుందని పేర్కొంటూ కరోనిల్‌ పేరిట పతంజలి ఓ ఆయుర్వేద ఔషధాన్ని ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, తొలుత దీన్ని కరోనాకు ఔషధంగా పేర్కొంటూ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం వల్ల.. కరోనిల్‌ కేవలం 'ఇమ్యూనిటీ బూస్టర్‌' మాత్రమేనని వివరణ ఇచ్చింది. హరియాణా ప్రభుత్వం సైతం దీన్ని కరోనా కిట్‌లో చేర్చి అందిస్తుండడం గమనార్హం.

ఇదీ చూడండి: బాబా రాందేవ్​కు హైకోర్టు నోటీసులు

Last Updated : Jun 6, 2021, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.