Actress Shobana Latest News : తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ పనిమనిషిని మంచి మనసుతో క్షమించారు ప్రముఖ నటి శోభన. వాళ్ల అమ్మ దగ్గర రూ.41వేలను పనిమనిషి దొంగతనం చేసినప్పటికీ.. తిరిగి ఆమెను పనిలోకి తీసుకున్నారు. పోలీసు కేసును కూడా విత్‌డ్రా చేసుకున్నారు. చేసిన తప్పును పనిమనిషి ఒప్పుకోవడం వల్ల.. ఆ 41వేల రూపాయలను నెలవారి జీతంలో తగ్గించి ఇస్తానని శోభన తెలిపారు. కాగా శోభన తన తల్లితో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైలో నివాసం ఉంటోంది.
ఇదీ జరిగిందీ..
కొద్ది నెలలుగా శోభన తల్లి ఆనందం వద్ద ఉన్న రూ.41వేలు కనిపించకుండా పోయాయి. దీనిపై శోభన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ కోసం తేనాంపేటలోని శ్రీమాన్ శ్రీనివాస రోడ్లో ఉన్న శోభన ఇంటికొచ్చారు. పోలీసుల విచారణతో తీవ్ర ఆందోళనకు గురైన పనిమనిషి విజయ.. చేసిన తప్పును శోభన ముందు ఒప్పుకుంది. ఆ 41వేల రూపాయలను తానే దొంగిలించానని తెలిపింది. అదే ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసే మురుగన్‌కు ఇచ్చి గూగుల్ పే ద్వారా తన కూతురుకు పంపినట్లు పేర్కొంది. చేసిన తప్పును ఒప్పుకున్నందుకు పనిమనిషి విజయను క్షమించారు శోభన.
తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాది భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించారు శోభన. కేవలం నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం శోభనను పద్మ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది. రెండు జాతీయ ఫిల్మ్ అవార్డ్‌లను సైతం ఆమె అందుకున్నారు. వారితో మరిన్నో అవార్డ్‌లను శోభనను వరించాయి. 1994లో 'కలర్పన్' అనే క్లాసికల్ డాన్స్ స్కూల్‌ను చెన్నైలో ప్రారంభించిన శోభన.. భారతనాట్యం తరగతులను నిర్వహిస్తోంది.
మేనేజర్ చేతిలో మోసపోయిన రష్మిక!.. ఏకంగా అన్ని లక్షలకు టోకరా?
Rashmika Mandanna Manager : కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాననకు కూడా షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురైనట్లు తెలిసింది! ఆమె ఆర్థిక లావా దేవిల విషయంలో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిందంటూ కొద్ది రోజుల క్రితం ప్రచారం సాగింది. తన కెరీర్ మొదటినుంచి తన దగ్గరే ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ ఆమెను మోసం చేశాడంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమె అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. సదరు మేనేజర్ తనకు తెలియకుండా సుమారు రూ.80 లక్షల వరకు కాజేశాడనే ఆరోపణలు బయటపడటం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నేషనల్ క్రష్‌గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి రష్మిక మందాన్న ఎలా మోసపోయిందో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.