ETV Bharat / bharat

Actress Gautami Left BJP : 'నన్ను మోసగించిన వ్యక్తికి మద్దతు ఇస్తారా? ఇక నేను పార్టీలో ఉండలేను'.. బీజేపీకి గౌతమి గుడ్​బై

Actress Gautami Left TN BJP : తమిళ నటి, రాజకీయ నాయకురాలు గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన రాజీనామా లేఖను ఆమె తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు.

Actress Gautami Left TN BJP
Actor Gautami Qutis BJP
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 1:43 PM IST

Updated : Oct 23, 2023, 7:01 PM IST

Actress Gautami Left BJP : భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు ప్రముఖ తమిళ నటి, రాజకీయ నాయకురాలు గౌతమి తాడిమళ్ల. ఈ మేరకు రాజీనామా లేఖను తన అధికారిక ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్​ చేశారు. ఈ పోస్ట్​లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు​ కె.అన్నామలైను కూడా ఆమె ట్యాగ్​ చేశారు. ఒక వ్యక్తి తనను ఆర్థిక లావాదేవీల విషయంలో మోసం చేశాడని.. అదే వ్యక్తికి పార్టీలోని కొంతమంది సీనియర్​ నేతలు అండగా నిలిచినట్లు ఆమె ఆరోపించారు. ఈ కారణంతోనే తాను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి వివరించారు.

ఈ విషయంలో పార్టీ నుంచి తనకు ఏ విధంగానూ మద్దతు లభించలేదని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన జీవితంలో ఊహించలేదని చెప్పారు. పార్టీలో తన నాయకత్వ స్థానం పట్ల బీజేపీ నాయకులు భ్రమలు కలిగించారని.. ఈ కారణంతో కూడా బరువెక్కిన హృదయంతో తన 25 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లు ఆమె సోమవారం లేఖలో పేర్కొన్నారు. కాగా, మొదటి నుంచి గౌతమి బీజేపీలోనే ఉన్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళ్యం సీటు తొలుత తనకే కేటాయిస్తారని పార్టీ హామీ ఇచ్చిందని.. అయితే చివరి నిమిషంలో దానిని రద్దు చేసి మొండిచెయ్యి చూపారని గౌతమి తెలిపారు. దీంతో పాటు తనను ఆర్థికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి మద్దతుగా నిలిచి.. పార్టీ నాయకత్వంలోని ఓ వర్గం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.

'న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది'
Actor Gautami Quits BJP : స్థిరాస్తుల విషయంలో తనను ఒక వ్యక్తి మోసం చేశారని పోలీసులకు గౌతమి ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినా తనకు న్యాయం చేయడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆమె అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పోలీసు, న్యాయవ్యవస్థ ద్వారా తనకు త్వరగా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

"దేశ నిర్మాణం కోసం నా వంతు సాయంగా 25 ఏళ్ల క్రితం నేను బీజేపీలో చేరాను. నా జీవితంలో అన్ని సవాళ్లను నేను ఎదుర్కొన్నాను. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశాను. 25 సంవత్సరాలుగా పార్టీ పట్ల విధేయతను కలిగి ఉన్నాను. ఈ క్రమంలో ఈ రాజీనామాతో నేడు నా జీవితంలో ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లయింది. చాలాసార్లు పార్టీ నుంచి నాకు ఎటువంటి మద్దతు అందలేదు. పైగా డబ్బు, ఆస్తి విషయంలో నన్ను నమ్మించి నయవంచన చేసిన వ్యక్తికే పార్టీలోని సీనియర్​ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆర్థికంగా నేను, నా కుమార్తె ఇద్దరం స్థిరపడ్డాం. ప్రస్తుతం మేము మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నాము."

- రాజీనామా లేఖలో గౌతమి

అన్నామలై స్పందన ఇదే..
Actress Gautami BJP : బీజేపీకి నటి గౌతమి రాజీనామాపై ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై స్పందించారు. "నేను గౌతమితో ఫోన్​లో మాట్లాడాను. తనకు జరిగిన మోసంపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినప్పుడు మేము ఆమెకే మద్దతు ఇచ్చాం. కానీ ఇప్పుడు కొందరు బీజేపీ నాయకులు.. ఆ వ్యక్తి(మోసం చేశాడని గౌతమి ఆరోపిస్తున్న వ్యక్తి)ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె భావిస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. నిందితుడిని ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రక్షించేందుకు ప్రయత్నించడం లేదు. గౌతమికి నిందితుడితో 25 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. మేము ఎప్పుడూ గౌతమికే మద్దతు ఇస్తాం" అని అన్నామలై తెలిపారు.

  • #WATCH | Tamil Nadu BJP chief K Annamalai says, "I spoke to Gautami Tadimalla on the phone and she demanding a very fast action...we had supported her to get the FIR registered, but now she feels that some BJP workers are trying to protect the accused. Nobody is trying to protect… https://t.co/76qTkFfA8B pic.twitter.com/8uQyA1bYGZ

    — ANI (@ANI) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jammu Kashmir Encounter Today : భారత్​లో చొరబాటుకు యత్నం.. తిప్పికొట్టిన భద్రతాబలగాలు.. ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

Barnala Policeman Murder : రెస్టారెంట్​ బిల్లు విషయంలో గొడవ.. కారులో కూర్చోమన్న పోలీసుపై దాడి చేసి హత్య.. నిందితుల్లో ఇంటర్నేషనల్​ కబడ్డీ ప్లేయర్స్!​

Last Updated : Oct 23, 2023, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.