దేశంలో అతి పిన్న వయస్సులో మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న కేరళ యువతి ఆర్య రాజేంద్రన్‌కు నటుడు మోహన్‌లాల్ శుభాకాంక్షలు తెలిపారు. 21ఏళ్ల ఆర్యకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.
ఆర్య రాజేంద్రన్ విజయం పట్ల అభినందనలు తెలిపిన మోహన్‌లాల్.. ఆమె నాయకత్వంలో తిరువనంతపురం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా.. తాను ఈసారి తిరువనంతపురం వెళ్లినప్పుడు ఆర్యను కలుస్తానని కూడా చెప్పారు. మోహన్‌లాల్ ఫోన్‌కాల్ పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆర్య. తప్పకుండా ఆయన్ను కలుస్తానని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్(సీపీఐఎం) కార్యకర్త అయిన ఆర్య తండ్రి.. ఆమెను తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదవన్‌ముకల్ వార్డు తరఫున పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిపై రెండు వేలకుపైగా ఓట్ల తేడాతో ఆర్య ఘన విజయం సాధించారు. చక్కని రాజకీయ దృక్పథం ఉన్న ఆర్యను మేయర్‌ని చేయాలని రాజకీయ పార్టీలు ఆసక్తిచూపిస్తున్నాయి.
ఆర్య.. ప్రస్తుతం తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కళాశాలలోని గణిత విభాగంలో బీఎస్సీ(ద్వితీయ సంవత్సరం) చదువుతున్నారు.
ఇదీ చదవండి: మేయర్ ఆర్య..! వయసు చిన్నది.. గెలుపు పెద్దది