దాదాపు 5 నెలల తర్వాత కేరళలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువకు పడిపోయింది. రెండో దశ మొదలైన కొత్తలో రాష్ట్రంలో తొలిసారి లక్షకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 96,646 క్రియాశీలక కేసులున్నాయి.
కేరళలో మంగళవారం కొత్తగా 7,823 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,09,619కి చేరింది. మరో 106 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 26,448కి ఎగబాకింది. సోమవారం నుంచి మరో 12,490 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనాను జయించినవారి సంఖ్య 46,85,932కు పెరిగింది.
లక్ష కేసులు తొలిసారి అప్పుడే..
కరోనా ఏప్రిల్ 19న కొత్తగా నమోదైన 13,644 కేసుల కారణంగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటి.. 1,07,330 వద్ద నిలిచింది. ఆగస్టులో ఓనమ్ పండుగ తర్వాత 30 వేల మార్కును దాటిన అనంతరం రోజూవారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వచ్చింది.
ఈ జిల్లాల్లో అధిక తీవ్రత..
కేరళలోని 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 1,178 కేసులున్నాయి. ఆ తర్వాత ఎర్నాకులం (931), తిరువనంతపురం(902) లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చూడండి: భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా14,313 మందికివైరస్