మహారాష్ట్ర ఠాణెలో(Maharashtra Thane) మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. సదరు నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
షిర్డీకి చెందిన బాధిత బాలిక.. ప్రైవేటు బస్సులో కల్యాణ్లోహ్ మార్గ్ ప్రాంతానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులను కలిసేందుకు ఉల్హాస్ నగర్ రైల్వే స్టేషన్కు లోకల్ రైలులో వెళ్లింది. అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. ఈ క్రమంలో శ్రీకాంత్ గైక్వాడ్ అనే వ్యక్తి.. ఆకస్మాత్తుగా వారి ముందుకు సుత్తితో వచ్చాడు. వారిపై దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత బాలికను వదిలేసి, ఆమె స్నేహితులు పరారయ్యారు.
ఆ తర్వాత బాలికను రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ పాత ఇంట్లోకి తీసుకువెళ్లి, ఆమెపై శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక(Rape Victim).. రాత్రంతా నిందితుడి వద్దే ఉన్నట్లు చెప్పారు. ఉదయం పూట తన స్నేహితులకు ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని బాలిక తెలియజేసిందని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ లోహ్మార్గ్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: 33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన అత్యాచార బాధితురాలు..
ఇదీ చూడండి: బాలికపై బంధువే అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య
ఇదీ చూడండి: మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!