ETV Bharat / bharat

'వృత్తి విద్య ప్రభుత్వ దానమేమీ కాదు' - వృత్తి విద్యపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

దేశంలో విద్యా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ విధుల్లో భాగమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తన పౌరులకు వృత్తి విద్యను అందుబాటులోకి తీసుకురావాల్సిందేనని.. అదేమీ దానంగా ఇవ్వాల్సింది కాదని అభిప్రాయపడింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 15, 2021, 7:06 AM IST

Updated : Apr 15, 2021, 7:20 AM IST

వృత్తి విద్యను అందుబాటులోకి తీసుకురావడం 'ప్రభుత్వం చేసే దానం ఏమీ కాద'ని, అది రాజ్యం కర్తవ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా సౌకర్యాలు అందుబాటులోలేని వారికి వీటిని కల్పించడం విధుల్లో భాగమని పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ యంత్రాంగం తమను ఎంపిక చేసినప్పటికీ ఎంబీబీఎస్‌లో సీట్లు కేటాయించకపోవడాన్ని సవాలు చేస్తూ లద్దాఖ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలుచేసిన రెండు వేర్వేరు పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సీటివ్వాల్సిందే..

ఈ అంశంపై న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వారిద్దర్నీ సెంట్రల్‌పూల్‌లో ఎంపిక చేసినందున ఒకరికి లేడీ హార్డింజ్‌ వైద్య కళాశాల, మరొకరికి మౌలానా ఆజాద్‌ వైద్య కళాశాలల్లో వారం రోజుల్లోగా సీట్లు కేటాయించాలని ఆదేశించింది. సెంట్రల్‌పూల్‌ కింద ఎంపికయిన విద్యార్థులకు సీట్లు లభించేలా పర్యవేక్షించేందుకు నోడల్‌ అధికారిని నియమించాలని పేర్కొంది.

ఇదీ చదవండి: ఎస్సీల కోసం ఫిర్యాదు పరిష్కార పోర్టల్​

'కరోనా​ లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దు'

Last Updated : Apr 15, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.