ETV Bharat / bharat

గ్రామీ అవార్డుకు ప్రధాని మోదీ పాట నామినేట్​- మిల్లెట్స్ సాంగ్​కు అరుదైన గుర్తింపు - అబండెన్స్​ ఇన్​ మిల్లెట్స్ మోదీ

Abundance In Millets Modi Song : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో తృణధాన్యాలపై రూపొందిన పాట ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటను ప్రముఖ ఇండో-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా(ఫాలూ), ఆమె భర్త గౌరవ్‌ షా సంయుక్తంగా రూపొందించారు.

Abundance In Millets Modi
Abundance In Millets Modi
author img

By PTI

Published : Nov 11, 2023, 10:39 AM IST

Abundance In Millets Modi Song : తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాలూ రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. 'అబండెన్స్​ ఇన్​ మిల్లెట్స్​' అనే ఈ పాటను ముంబయిలో జన్మించిన ఫాల్గుణి షా రాసి ఆలపించారు. ఈమె ఫాలూగా ప్రసిద్ధి చెందారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా కూడా ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన సైతం ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.

  • A song on Millets which was produced in collaboration with PM Modi has been nominated under Best Global Music Performance category for Grammy awards 2024. pic.twitter.com/5Iqpu61GKC

    — Press Trust of India (@PTI_News) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Abundance in Millets Grammy : 'అబండెన్స్​ ఇన్​ మిల్లెట్స్​' అనే పాటను ఈ ఏడాది జూన్​లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో విడుదల చేశారు. ఈ పాట రచయిత ఫాలూ ఇప్పటికే 'కలర్​ఫుల్​ వరల్డ్'​ అనే పాటకు 2022 చిన్నారుల ఆల్బమ్​ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డు గెలుచుకున్న అనంతరం భారత్​కు వచ్చిన ఆమె.. మోదీని కలిసి మిల్లెట్స్​పై పాట రాయాలనే ఆలోచన ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన మోదీ.. మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సంగీతానికి బలమైన శక్తి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన కోసం ఒక పాట రాయాలని ఫాల్గుణి షా దంపతులకు సూచించారట. ఆయన్ను కూడా పాటలో భాగమవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించడం వల్ల పాట రూపుదిద్దుకుంది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భారత్​ చేసిన ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలోని ఆహార, వ్యవసాయం సంస్థతో పాటు జనరల్​ అసెంబ్లీ ఆమోదించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Grammy Nominations 2024 : 'అబండెన్స్​ ఇన్​ మిల్లెట్స్​'తో పాటు అరూజ్ అఫ్తాబ్​, విజయ్​ అయ్యర్​, షాజాద్​ ఇస్మైలీల 'షాడో ఫోర్సెస్​'.. 'అలోన్'​కు బుర్ణ బాయ్​, 'ఫీల్'​ పాటకు డేవిడో, 'మిలాగ్రో వై డిసాస్ట్రే'కు సిల్వానా ఎస్ట్రాడా నామినేట్ అయ్యారు. బ్లా ఫ్లెక్​, ఎడ్గర్​ మేయర్​, జాకీర్​ హుస్సేన్​ల పాస్టో.. కిమాఫంక్​, ట్యాంక్​, బంగాస్​ల టోడో కలర్స్​ పాటలు నామినేట్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు.

More Than One Lakh People Garba Dance : మోదీ పాటకు ఒకేసారి లక్షా 21వేల మంది 'గర్బా' డాన్స్​.. మూడు ప్రపంచ రికార్డులు దాసోహం

PM Modi Song Lyrics : పాటకు లిరిక్స్ రాసిన ప్రధాని మోదీ.. మ్యూజిక్ ఆల్బమ్ చూశారా? త్వరలోనే ఇంకో సాంగ్ కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.