దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీని మరింత విస్తృతం చేసే దిశగా ముందుడుగేశారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఆప్ జాతీయ మండలి 9వ సమావేశం సందర్భంగా దిల్లీలో ఈ ప్రకటన చేశారు కేజ్రీవాల్.
"ఇతర పార్టీలకు ముందుచూపు లేదు. అందుకే వారు గతాన్ని తవ్వుకుంటున్నారు. ఆప్ మాత్రమే భవిష్యత్తు గురించి మాట్లాడుతోంది. 21, 22 శతాబ్దాల దూర దృష్టి మా పార్టీకి ఉంది. అందుకే రానున్న రెండేళ్లలో ఆరు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నాం."
- అరవింద్ కేజ్రీవాల్, ఆప్ జాతీయ సమన్వయకర్త
తమ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఈ సందర్భంగా పార్టీ సభ్యులను కోరారు కేజ్రీవాల్. దేశమే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. ఆప్ వేదికగా దేశాభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: 'ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి'