Councillor Shot Dead: పంజాబ్‌లో మరో హత్య కలకలం రేపింది. ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను పట్టపగలే దారుణంగా చంపారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన మాలేర్కోట్లా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగింది. 18వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ అక్బర్‌ను జిమ్‌లో వ్యాయామం చేస్తుండగానే.. దుండగులు అతి దగ్గరి నుంచి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్.. తిరుగులేని సాక్ష్యం కాదు'
మైనర్‌పై కానిస్టేబుల్ అత్యాచారం.. చెట్టుకు కట్టేసి మహిళపై..