తనకు దక్కుతుందన్న ఆశో! చివరి సారి చూడాలన్న తపనో! తెలియదు గాని ఉత్తర్ప్రదేశ్ భదోహికి చెందిన ఓ యువకుడు పెళ్లికూతురు వేశంలో ప్రియురాలి పెళ్లికి వెళ్లాడు. ఎవరూ తనని గుర్తుపట్టరని అనుకున్నాడు. అయితే అతడు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది.
మండపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ప్రియుడు పెళ్లి కూతురు బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. అతనెవరో తెలుసుకున్న బంధువులు.. ఆ భగ్న ప్రేమికుడిని మందలించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: పాండాకు ప్రెగ్నెన్సీ- ఆ రెస్టారెంట్ల షేర్లకు రెక్కలు