పాము కాటు వేస్తే ఎవరైనా దాన్ని కొట్టి చంపేస్తారు. లేదంటే అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. వెంటనే ఆస్పత్రికి వెళ్తారు. అయితే కర్ణాటకలోని చిక్కమగళూరులో తరికెరె నగరంలో ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. తనను కరిచిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఇదీ జరిగింది..
కోల్‌కతాకు చెందిన ఆసిఫ్ అనే యువకుడు.. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ఆ సమయంలో అతడికి పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లమని స్థానికులు సూచించారు. కానీ అతడు మాత్రం తనను కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. చేతిలో పాము ఉండడం చూసి ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆసిఫ్‌కు చికిత్స అందించారు.
కవర్లో పామును తీసుకెళ్లిన రైతు..
కొద్దిరోజుల క్రితం.. ఒడిశాలోని బాలాసోర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. భగవత్ ప్రధాన్ అనే రైతు తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లాడు. అప్పుడు అతడికి పాము కాటు వేసింది. వెంటనే భగవత్ తన బంధువును కర్ర పట్టుకుని రమ్మన్నాడు. ఇద్దరు కలిసి పాముని కర్రతో ఒడిసి పట్టుకున్నారు. తర్వాత పాలిథీన్ కవర్లో పెట్టి.. బాలాసోర్ మెడికల్ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరి దగ్గర పామును చూసి ఆస్పత్రిలోని వైద్యులు, రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. వైద్యులు చికిత్స అనంతరం భగవత్ కోలుకుంటున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.