ETV Bharat / bharat

'పూనావాలాకు జడ్ ప్లస్ భద్రత కల్పించండి' - అదర్ పూనావాలా జడ్ ప్లస్ భద్రత

సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఓ న్యాయవాది. పూనావాలాకు ఎదురైన బెదిరింపులపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. టీకా తయారీదారులు అభద్రతా భావంలో ఉంటే.. ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

adar poonawalla
అదర్ పూనావాలా
author img

By

Published : May 6, 2021, 8:30 AM IST

టీకా సరఫరా విషయంలో సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాకు బెదిరింపులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయనకు రక్షణ కల్పించాలంటూ బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పూనావాలాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది దత్తా మానె కోరారు. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

కొందరు రాజకీయ నాయకులు టీకా డోసుల కోసం అదర్ పూనావాలాను బెదిరించారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర డీజీపీ, పుణె కమిషనర్ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. టీకా తయారీదారులు అభద్రతా భావంతో ఉంటే ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు.

పూనావాలాపై ఒత్తిడి

టీకా విషయంలో తనపై అనూహ్యమైన ఒత్తిడి ఉందని అదర్ పూనావాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అందువల్లే తన కుటుంబంతో కలిసి లండన్​కు వెళ్లినట్లు తెలిపారు.

పూనావాలాకు బెదిరింపు ఆరోపణల నేపథ్యంలో ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్రం.

ఇదీ చదవండి: 'బెదిరింపులపై పూనావాలా ఫిర్యాదు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.