ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మహిళ తన ఐదుగురు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. మహాసముంద్, బేల్సొండా రైల్వే జంక్షన్ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది...
ఉమా సాహు (45), జిల్లాలోని బెమ్చా గ్రామంలో తన భర్తతో నివసిస్తోంది. వారికి నలుగురు ఆడపిల్లలు. ఇంట్లో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఉమా.. తన ఐదుగురు పిల్లలతో కలిసి.. మహాసముంద్, బేల్సొండా రైల్వే జంక్షన్ దగ్గిరికి బుధవారం రాత్రి వెళ్లింది. వేగంగా ప్రయాణిస్తున్న రైలు ముందు పట్టాలపై దూకారు. ఈ ఘటనలో అందరూ మరణించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ జరిగింది: Rape: బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారం