ETV Bharat / bharat

ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి! - chhattisgarh car runs over devotees

जशपुर जिले के पत्थलगांव में दशहरे की झांकी में शामिल 20 लोगों को तेज रफ्तार कार ने कुचल दिया. घटना पत्थलगांव इलाके की है. इनमें से चार लोगों की मौत इलाज के दौरान हो गई.

a-speeding-car-crushed-20-people-involved-in-the-dussehra-tableau-at-pathalgaon
ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
author img

By

Published : Oct 15, 2021, 5:12 PM IST

Updated : Oct 15, 2021, 7:19 PM IST

17:06 October 15

ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి!

ప్రజలపైకి వేగంగా దూసుకెళ్లిన కారు

ఛత్తీస్​గఢ్​ జశ్​పుర్​లో దారుణ ఘటన జరిగింది. పతాలగావ్​లో దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి వెళుతుండగా.. ఓ బృందంలోని 20మందిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఘటన నుంచి తేరుకున్న అనంతరం స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  

ఘటన అనంతరం కారును స్థానికులు వెంబడించారు. కొద్దిసేపటి అనంతరం ఊరి చివర.. కారు మంటల్లో కాలుతూ కనపడింది. వాహనంలో భారీ మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్నారని, అందుకే వారే కారుకు నిప్పంటించారని స్థానికులు ఆరోపించారు.

ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. వారు మధ్యప్రదేశ్​కు చెందిన బబ్లు విశ్వకర్మ, శిశుపాల్​ సాహులుగా గుర్తించారు.  

స్థానికుల ఆగ్రహం..

కారు దూసుకెళ్లిన ఘటన అనంతరం ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పతాల్​గావ్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట బైటాయించారు. నిరసన చేపట్టారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ పోలీసును నిరసనకారులు కొట్టినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపైనా దాడి చేసినట్టు సమాచారం.

'హృదయవిదారకం...'

ఘటనపై ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ భఘేల్​ స్పందించారు. ఘటన హృదయవిదారకమన్నారు.

"జశ్​పుర్​ ఘటన హృదయవిదారకం. నిందితులను వెంటనే పట్టుకున్నారు. ఓ పోలీసు అధికారిపై చర్యలు చేపట్టారు. దర్యాప్తు ముమ్మరం చేశాము. ఎవరినీ విడిచిపెట్టము. అందరికీ న్యాయం జరుగుతుంది.

                         --- భూపేశ్​ భఘేల్​, ఛత్తీస్​గఢ్​ సీఎం.

ఘటనపై భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​ స్పందించారు. 

"ఇది ఎంతో బాధాకరమైన వీడియో. ఛత్తీస్​గఢ్​లో డ్రగ్​ మాఫీయా ఎవరికీ భయపడటం లేదు. మతపరమైన ఊరేగింపుల చేసే వారిని ఈ విధంగా అణచివేస్తారా? జశ్​పుర్​ ఎస్​పీని తక్షణమే తొలగించాలి. మృతుల కుటుంబాలకు రూ. 50లక్షల పరిహారాన్ని ఇవ్వాలి. క్షతగాత్రుల చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలి."

              --- రమణ్​ సింగ్​, మాజీ సీఎం.

ఇదీ చూడండి:- పండగపూట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి 11మంది మృతి

Last Updated : Oct 15, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.