ఓ యువకుడిపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కర్ణాటకలోని రాయ్చుర్ జిల్లాలో జరిగింది. మస్కి తాలుకా హులాపుర్ గ్రామంలో నివాసం ఉండే డ్రైవర్ సుగురెడ్డి.. తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలోని ఓ టాయిలెట్లో రేప్ చేశాడని బాధితుడి తండ్రి పేర్కొన్నారు. ఫిబ్రవరి 9న ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫిబ్రవరి 10న తన మొబైల్ ఫోన్కు వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు.
తన కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు బాధితుడి తండ్రి. స్పష్టంగా మాట్లాడలేడని అన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: 'కశ్మీర్లో యాక్టివ్గా 200 మంది ఉగ్రవాదులు'