ETV Bharat / bharat

అదిరే ఫీచర్లతో సూపర్​ ఈ- బైక్​ 'ప్రాణ' - కోయంబత్తూరు

పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఎలక్ట్రిక్​ బైక్​ను రూపొందించింది. సరికొత్త ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటున్న ఈ బైక్​ గంటకు 123 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

electric bike
కుర్రకారును మెప్పిస్తున్న 'ప్రాణ'
author img

By

Published : Feb 5, 2021, 7:13 AM IST

Updated : Feb 5, 2021, 3:29 PM IST

అదిరే ఫీచర్లతో సూపర్​ ఈ- బైక్​ 'ప్రాణ'

బైక్​లు అంటే కుర్రకారుకు మాములు మజా కాదు. కానీ అవి ఉత్పత్తి చేసే విషవాయువులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇందుకోసం ఈ సమస్యకు చెక్​ పెడుతూ కోయంబత్తూరుకు చెందిన శ్రీవరు మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్​ ఎలక్ట్రిక్​ బైక్​ను రూపొందించింది. 'ప్రాణ'​ పేరుతో మార్కెట్​లోకి ప్రవేశపెట్టిన ఈ-బైక్​కు ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

'ప్రాణ' సురక్షితమైన ఎలక్ట్రిక్​ బైక్​ అని శ్రీవరు మోటార్స్​ ఇంజనీర్​ మోహన్ పెరియస్వామి అన్నారు. ఈ బైక్ వాహనరంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందన్నారు.

"ఇందులో టెలీస్కోపిక్​ సస్పెన్షన్ ఉండటం వల్ల వాహనం నడుపుతున్నప్పుడు ఎలాంటి అదురు ఉండదు. ఈ బైక్​కు క్లచ్​ లేకపోవడం వల్ల వినియోగదారుల ప్రయాణం సులభం అవుతుంది. ఇది ఎలాంటి విషవాయువులను విడుదల చేయదు. 10 మొక్కలు నాటినట్లు కొనుగోలుదారులు చిత్రాలు చూపిస్తే వారికి 25వేలు డిస్కౌంట్​ ఇస్తాం."

-మోహన్​ పెరియస్వామి, శ్రీవరు మోటార్స్​ ఇంజనీర్​

4 నిమిషాల్లో 60 కి.మీ. వేగం..

వైవిధ్యమైన ఫీచర్లతో ఉన్న ఈ బైక్​ కుర్రకారును ఆకట్టుకుంటోంది. 160 కిలోల బరువు ఉండే ఈ బైక్​ ఒక్క సారి ఛార్జ్​ చేస్తే 126 కిలోమీటర్లు వెళుతుంది. డిజిటల్​ డిస్​ప్లే గల ఈ ద్విచక్రవాహనం అత్యధికంగా గంటకు 123 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అంతే కాదు, స్టార్ట్​ చేసిన నాలుగు నిమిషాలకే 60 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. ఇందులో రివర్స్​ మోడ్​, రేస్​ మోడ్​లు ఉండటం విశేషం. రేస్​మోడ్​లో గంటకు 123 కిమీ, రివర్స్​ మోడ్​లో గంటకు అత్యధికంగా 5 కిలోమీటర్లతో వెళ్లవచ్చు. రూ. 2.25 లక్షలు ఖరీదు ఉన్న ఈ బండి మిస్టరీ బ్లాక్​​, ప్యాషనేట్​ రెడ్​, ప్రోగ్రెసివ్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఆధునిక ఫీచర్లతో స్పోర్ట్స్​ బైక్​కు దీటుగా 'ప్రాణ' దూసుకెళ్తోందని వినియోగదారులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : 'తేజస్'​ ఎక్కిన ఎంపీ తేజస్వీ సూర్య

Last Updated : Feb 5, 2021, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.