ఉత్తరాఖండ్ జోషిమఠ్ జిల్లా చమోలీ జల విలయంలో ఆచూకీ గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ వారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు కుటుంబసభ్యులు. ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా.. ఎలా ఉన్నారో తెలియదు. ఈ పరిస్థితుల్లో.. ఓ కార్మికుడి కుటుంబంలో ఆనందం నింపింది ఓ ఫోన్‌కాల్. తమ మనిషి ప్రాణాలతోనే ఉన్నాడన్న భరోసా కల్పించింది.
తెహ్రీ గర్వాల్‌కు చెందిన జితేంద్ర ధనయ్ అనే కార్మికుడు తపోవన్ విద్యుత్తు కేంద్రంలో 2017 నుంచి పని చేస్తున్నాడు. జల ప్రళయం జరిగి సొరంగంలో చిక్కుకుపోయాడు. అప్పటి నుంచి అతని కోసం కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగ్ అవుతున్నా సమాధానం లేకపోయేసరికి ఆందోళన చెందారు.
అయితే.. ఐదు రోజుల తర్వాత తమ ఫోన్‌కు జితేంద్ర సమాధానమిచ్చారని ఆయన సోదరి సీమా తెలిపారు. హలో! అని అన్న వెంటనే కనెక్షన్ తెగిపోయినట్లు చెప్పారు. తన సోదరుడి నుంచి స్పందన రావటం చాలా సంతోషంగా ఉందని.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న భరోసా వచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: 'మంచు కురవడం వల్లే జలప్రళయం'