ETV Bharat / bharat

ఇంధనం లేక నిలిచిపోయిన అంబులెన్స్​.. తోసుకుంటూ వెళ్లిన బంధువులు.. అయినా.. - అంబులెన్స్ నిలిచిపోయి మరణించిన రోగి

మార్గమధ్యంలో అంబులెన్స్​ నిలిచిపోవడం వల్ల ఓ రోగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని బాంస​వాఢాలో జరిగింది. ఇంధనం లేకపోవడమే​ అంబులెన్స్​ నిలిచిపోవడానికి కారణమని అధికారులు తెలిపారు.

patient dead after ambulance stopped
patient dead after ambulance stopped
author img

By

Published : Nov 26, 2022, 5:09 PM IST

రాజస్థాన్​ బాంస​వాఢాలో విషాదం నెలకొంది. అంబులెన్స్​ నిలిచిపోవడం వల్ల ఓ రోగి మృతిచెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోగిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో అంబులెన్స్​లో ఇంధనం​ అయిపోయింది. దీంతో రోగి తరఫు బంధువులే అంబులెన్స్​ను నెట్టుకుంటూ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్లకపోవడం వల్ల రోగి మృతి చెందాడు.

rajasthan ambulance news
అంబులెన్స్​ను నెడుతున్న రోగి తరఫు బంధువులు

దీనిపై స్పందించిన అధికారులు.. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితురాలి బంధువులతో మాట్లాడి ఘటనకు గల కారణాన్ని తెలుసుకుంటామని చెప్పారు. ఈ అంబులెన్స్​ను ప్రైవేట్​ ఏజెన్సీ నిర్వహిస్తోందని.. దీనికి పూర్తి బాధ్యత వారిదేనన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని సీఎమ్​హెచ్​ఓ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పీఎస్​ ఖచారివ్యాస్​.. తమ ప్రభుత్వం ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యాన్ని అందిస్తోందన్నారు. ఇది వ్యవస్థ తప్పిదం కాదని.. పూర్తిగా నిర్వహణ సంస్థ తప్పేనని చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: కొత్త వివాదంలో ఆప్ మంత్రి.. మరో వీడియో లీక్.. అందులో ఏముందంటే?

ఎలుకకు రాయి కట్టి కాలువలో పడేసి హత్య! శవపరీక్ష కోసం జంతుప్రేమికుల డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.