Bodybuilding competition: ఆసుపత్రిలో నర్సుగా చేస్తున్నవారు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. ప్రస్తుత కరోనా సమయంలో వారు నిర్విరామంగా డ్యూటీ చేయాల్సి వస్తోంది. అయితే.. 25 ఏళ్ల ఓ యువతి అటు నర్సుగా విధులు నిర్వర్తిస్తూనే తనకు ఇష్టమైన బాడీబిల్డింగ్ చేస్తోంది. రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. జిమ్‌కు వెళ్లి ఏదో అలా గడిపేస్తుందేమో అనుకుంటే పొరబడినట్లే.. గత ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆరో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఆమెనే.. బంగాల్, మాల్డా నగరానికి చెందిన లిపిక.
ధలాయ్ జిల్లాలోని సలేమా గ్రామానికి చెందిన లిపిక నర్సుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. 2020లో మాల్డాలోని చంచల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విధుల్లో చేరింది. ఉద్యోగం చేస్తూనే తన లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకోసం ప్రతిరోజు 150 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేస్తోంది. రోజూ ఉదయం చంచల్‌లో బస్సు ఎక్కి మాల్డాకు వచ్చి.. కోచ్ పింకు భగత్ ఆధ్వర్యంలో కొన్ని గంటల పాటు శిక్షణ తీసుకుంటుంది. ఆ తర్వాత తిరిగి చంచల్‌కు వెళ్లి ఆసుపత్రిలో సేవలందిస్తుంటుంది. గత నెలలో పుణెలో జరిగిన అంతర్జాతీయ స్థాయి మిస్టర్ అండ్ మిస్ యూనివర్స్ పోటీల్లో ఆరో స్థానంలో నిలిచింది లిపిక. తన తదుపరి లక్ష్యం ఒలిపింక్స్‌లో పాల్గొనటమేనని చెబుతోంది.
"నేను చేయాలనుకున్న పనిపై ఏకగ్రత పెట్టేందుకు ప్రయత్నిస్తా. నా విధులు ముగించుకున్నాక దానిపైనే దృష్టి పెడతా. నా డ్యూటీ ముగియగానే గుర్తొచ్చేది జిమ్‌కి వెళ్లాలని. చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయటం అంటే ఇష్టం. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. మా నాన్న రిటైర్డ్ టీచర్. చిన్నప్పటి నుంచే నన్ను జిమ్‌కి తీసుకెళ్లేవారు. తొలుత కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చినప్పటికీ సాధన చేయటం కొనసాగించాను. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికాక మాల్డాకు మారను."
- లిపిక, నర్సు
2021లో కోచ్ పింకు భగత్‌ను కలిశానని.. అప్పటి నుంచే బాడీబిల్డింగ్ సాధన చేయటం మొదలు పెట్టానని తెలిపింది లిపిక. ఏప్రిల్ 15-16 మధ్య పుణెలో జరిగిన పోటీల్లో ఆరో ర్యాంక్ సాధిస్తానని ఊహించలేదని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. గతంలో బంగాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: 'లిక్కర్ కిక్ ఇవ్వట్లే.. కల్తీ చేస్తున్నారు!'.. హోంమంత్రికి మందుబాబు ఫిర్యాదు
రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు...