ETV Bharat / bharat

అనుమానాస్పద పేలుడు.. ఇద్దరికి తీవ్రగాయాలు

ఓ రెండంతస్తుల భవనంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

mysterious explosion
అనుమానస్పద పేలుడు
author img

By

Published : Aug 16, 2021, 11:24 AM IST

Updated : Aug 16, 2021, 12:39 PM IST

అనుమానాస్పద పేలుడు

కర్ణాటక రాజధాని బెంగళూరులో అనుమానాస్పద పేలుడు సంభవించింది. విజయ్​నగర్ కాలనీలోని ఓ రెండంతస్తుల భవనంలో ఆదివారం(ఆగస్టు 15) అర్ధరాత్రి ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు సూర్యనారాయణ శెట్టి(74), పుష్పవతమ్మ(70) తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు​ వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందం.. మంటలను అదుపులోకి తెచ్చింది. విజయ్​నగర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మొదట సిలిండర్ పేలిందని.. భావించినా తర్వాత ఏదో అనుమానాస్పద పదార్థం అని పోలీసులు తేల్చారు.

పేలింది అదేనా..?

అయితే సూర్యనారాయణ శెట్టి.. ఇటీవల కొన్న ఫ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఫ్రిడ్జ్ పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: బావను చంపి.. చెయ్యి నరికిన బావమరిది

Last Updated : Aug 16, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.