ETV Bharat / bharat

సోదరి కులాంతర వివాహం.. బైక్​పై వచ్చి సినీ ఫక్కీలో ఎత్తుకెళ్లిన అన్న

author img

By

Published : Jun 6, 2023, 10:32 AM IST

తమ ఇష్టానికి విరుద్దంగా ప్రేమ పెళ్లి చేసుకున్న యువతిని.. సినీ ఫక్కీలో తన అత్తింటి నుంచి ఎత్తుకెళ్లాడు ఆమె సోదరుడు. ఆమె ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా బైక్​పై ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...

A Married Women Was Taken Forcefully
అత్తింటి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన సోదరుడు
యువతిని ఎత్తుకెళ్లిన సోదరుడు

కులాంతర వివాహం చేసుకున్న యువతిని అత్తారింటి నుంచి ఎత్తుకెళ్లాడు ఆమె సోదరుడు. యువతి అత్తారింట్లో ఉండగా.. ఇద్దరు యువకులు బైక్​పై వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. వారితో వెళ్లేందుకు యువతి నిరాకరించినప్పటికీ వారు వదల్లేదు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.

ఇదీ జరిగింది
బిహార్ అరారియా జిల్లాకు చెందిన రూప, ఛోటు కుమార్ ఠాకూర్ గంత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. అయినా కుటుంబసభ్యులను ఎదురించి జూన్​ 2న కులాంతర వివాహం చేసుకుంది యువతి. దీంతో ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరుసటి రోజే.. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను తన అత్తారింట్లో నుంచి బలవంతంగా బయటకి లాక్కొచ్చాడు. ఆమె అత్తామామలు వారి కోడలిని విడిచి పెట్టాలని ఎంత బతిమాలినా వినకుండా.. వారిపై దాడి చేసి ఆమెను బైక్​పై ఎత్తుకెళ్లాడు. స్థానికులు ఈ ఘటనను తమ సెల్​ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

ఫిర్యాదు అందుకున్న బతనహ ఓపీ పోలీసులు.. యువతిని తన పుట్టింటి నుంచి పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. 'అమ్మాయి తరఫు బంధువులకు ఛోటు కుమార్ ఎవరో తెలియదు. దీంతో ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఛోటు కుమార్ తండ్రిపై రూప సోదరుడు దాడి చేశాడు. జరిగిన ఘటనపై రూప స్టేట్​మెంట్​ తీసుకొని నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం' అని పోలీసు అధికారి కుశ్రు సిరాజ్​ తెలిపారు.

అబ్బాయి తండ్రిపై దాడి: రూప ఇంట్లో ప్రేమ వ్యవహారం తెలియగానే.. ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో అబ్బాయి తండ్రిని పిలిపించి మాట్లాడారు. ఇరువురి సామాజిక వర్గం వేరు కావడం వల్ల వారి ప్రేమను అంగీకరించేది లేదని రూప తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. అయితే దీనిపై స్పందించిన అబ్బాయి తండ్రి..' నాకు ఇష్టం లేకున్నా, వారే బలవంతంగా పంచాయితీకి పిలిపించారు. అక్కడ గ్రామ పెద్ద వారి సామాజిక వర్గానికి చెందిన వాడని.. నన్ను తీవ్రంగా కొట్టారు. అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకొని బయటపడ్డాను' అని చెప్పారు.

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని
కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. కాలు కందకుండా గుండెలపై మోశారు.. కంటికి రెప్పలా చూసుకున్నారు.. కంట నీరు కారకుండా కాపాడుకున్నారు.. అడిగిందల్లా ఇచ్చారు.. కానీ కన్నపేగు తమ మాట వినకుండా మరొకరిని ఇష్టపడటాన్ని నిర్ణించుకోలేకపోయారు.. వద్దన్నా వినకుండా ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు.. కన్న కూతురు తమ మాట వినలేదని.. ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. మానసికంగా కుంగిపోయారు. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి సైతం సిద్ధపడ్డారు. గతేడాది వర్ధన్నపేటలో జరిగిన ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.