ETV Bharat / bharat

రేప్​ నుంచి యువతిని కాపాడిన ట్రాన్స్​జెండర్లు.. కామాంధుడ్ని చితకబాది...

ఓ కామాంధుడికి ఇద్దరు ట్రాన్స్​జెండర్లు బుద్ధి చెప్పారు. ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని కొట్టి, పోలీసులకు అప్పగించారు.

woman rescued by transgenders
woman rescued by transgenders
author img

By

Published : Jul 4, 2022, 6:36 PM IST

అత్యాచారానికి యత్నించిన కామాంధుడ్ని చితకబాది, ఓ యువతిని రక్షించారు ఇద్దరు ట్రాన్స్​జెండర్లు. నిందితుడ్ని పోలీసులకు పట్టించారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

woman rescued by transgenders
నిందితుడు మసూరల్ షేక్​

బంగాల్​కు చెందిన ఓ యువతి.. ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరు వచ్చింది. నగరంలోని ఓ చోట గది అద్దెకు తీసుకుని ఉంటోంది. బంగాల్​కు చెందిన మసూరల్ షేక్.. ఆ యువతి ఒంటరిగా ఉంటోందని గుర్తించాడు. కొద్దిరోజులుగా ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఈనెల 2న ఉదయం 4 గంటలకు ఆ యువతి ఇంటికెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తెరిచేలోగా ఆమెను పట్టుకుని, అత్యాచారం చేయబోయాడు. యువతిని లోపలకు తోసి, డోర్ వేసేశాడు. వదిలేయమని ఎంత ప్రాధేయపడినా అతడు మాట వినలేదు.

woman rescued by transgenders
కాపాడిన ట్రాన్స్​జెండర్లు

అదే ఇంట్లో పై అంతస్తులో ట్రాన్స్​జెండర్లు అయిన మహీరా సింగ్, ఆమె స్నేహితురాలు నివసిస్తున్నారు. బాధితురాలి కేకలు విని వారు పరుగెత్తుకుంటూ కిందకు వచ్చారు. తలుపు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. అఘాయిత్యం చేయబోతున్న మసూరల్ షేక్​ను ఇద్దరూ కలిసి చితకబాదారు. నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు. యువతిని కాపాడిన మహీర, ఆమె స్నేహితురాలిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదీ చదవండి: బాలుడిని నదిలోకి లాక్కెళ్లిన మొసలికి ఎక్స్​రే.. రిపోర్ట్స్​ చూస్తే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.