ETV Bharat / bharat

కర్ణాటకవాసి వినూత్న డిమాండ్​.. హామీ పత్రం ఇస్తేనే టీకా.. - టీకా హామీ పత్రాన్ని డిమాండ్​ చేసిన కర్ణాటక వ్యక్తి

వ్యాక్సిన్ వేసుకుంటే తనకు ఏ ఆరోగ్య సమస్యలు రావనే హామీ పత్రం ఇవ్వాలని కలెక్టర్​ను డిమాండ్​ చేశాడు కర్ణాటక, ధార్వాడ్​​కు చెందిన వ్యక్తి. హామీ పత్రం ఇచ్చిన తర్వాతే వ్యాక్సిన్​ వేయించుకున్నాడు.

A man takes vaccine after getting Guarantee Letter
హామీ పత్రాన్ని ఇస్తున్న అధికారులు
author img

By

Published : Nov 29, 2021, 7:25 PM IST

టీకా హామీ పత్రాన్ని డిమాండ్​ చేసిన కర్ణాటక వ్యక్తి

టీకా వేయించుకునేందుకు వినూత్నమైన డిమాండ్ చేశాడు కర్ణాటక, ధార్వాడ్​​కు చెందిన వ్యక్తి. టీకా అనంతరం ఆరోగ్య సమస్యలు ఉండవని హామీ పత్రం ఇచ్చిన తర్వాతే వ్యాక్సిన్​ వేసుకున్నాడు.

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో స్థానికులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్​. షాపింగ్ మాల్స్​, జిమ్స్​, బార్లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్​లకు చెందినవారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనంద్​ కుందనూర్​ అనే వ్యక్తి టీకా హామీ పత్రాన్ని ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే తనకు ఏ ఆరోగ్య సమస్యలు రావనే హామీ పత్రం ఇవ్వాలని కోరారు. దీంతో అధికారులందరూ హామీ పత్రంపై సంతకాలు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రపతి పర్యటనలో భద్రతా సిబ్బందికి కరోనా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.