మహారాష్ట్ర, పుణెలోని ఫ్యాషన్ మార్కెట్ వీధిలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 500 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
16 అగ్నిమాపక వాహనాల సాయంతో మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. భారీ ఎత్తున ఎగిసిపడిన జ్వాలలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చినట్లు చెప్పారు.
బదలాపుర్ పారిశ్రామిక వాడలో..
థానే జిల్లాలోని బదలాపుర్ ఎమ్ఐడీసీ పారిశ్రామికవాడలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక దళాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి.
ఇదీ చదవండి: బస్టాండ్లో అగ్నిప్రమాదం- ఏడు బస్సులు దగ్ధం