"శ్రీలంకలో గ్యాస్ లేదు. ఒక లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. అదంతా నరకంలా ఉంది" అంటూ శ్రీలంకలో తన అనుభవాన్ని చెప్పాడు అబ్దుల్లా మహ్మద్ షఫీ. 14 ఏళ్ల పాటు శ్రీలంకలో నివసించిన షఫీ..నార్త్ సెంట్రల్ కొలంబోలో హోటల్‌ను నిర్వహించాడు. కానీ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తడం వల్ల పరిస్థితులన్నీ మారిపోయాయి. గత మూడు నెలలుగా అక్కడ నరకయాతన అనుభవించిన షఫీ.. తన స్వస్థలమైన కేరళలోని కాసర్‌గోడ్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం షఫీ తన జీవనం కోసం అప్పడాలు అమ్ముకుంటున్నాడు.
"హోటల్‌ను నిర్వహించేందుకు అవసరమైన గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. హోటల్‌కు వచ్చే వారి సంఖ్య సైతం క్రమంగా తగ్గిపోయింది. ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. మరో అవకాశం లేకపోవడం వల్ల హోటల్‌ను మూసివేశాను. మరో మిత్రుడితో కలిసి మెడికల్ షాపును ప్రారంభించాను. అది కూడా సరిగ్గా నడవలేదు."
-మహ్మద్ అబ్దుల్ షఫీ
అన్నీ వదిలేసి శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన షఫీ.. కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. తన మిత్రుడి సలహాతో అప్పడాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. శ్రీలంకలోని తన స్నేహితులు పిలుస్తున్నారని షఫీ చెబుతున్నాడు. అక్కడ ప్రస్తుతం దారుణ పరిస్థితులు ఉన్నాయని.. రోజు ఆహారం దొరకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా కేరళకు చెందిన అనేక మంది శ్రీలంకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపాడు.
ఇవీ చదవండి:
చరిత్ర సృష్టించిన భారత్.. 200 కోట్ల కొవిడ్ టీకా డోసుల పంపిణీ