భారత ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఫోన్ హ్యాకింగ్ అంశంపై కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని కేంద్రప్రభుత్వం మండిపడింది. ఆయా వార్తలన్నీ నిరాధారమైనవని తేల్చిచెప్పింది. కొందరు కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న వార్తల నేపథ్యంలో లోక్‌సభలో ఈమేరకు ప్రకటన చేశారు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్.
అసాధ్యం
భారతీయులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించినట్లు వచ్చిన మీడియా కథనాలను మంత్రి తోసిపుచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
గతంలోనూ వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, ఓ జడ్జి, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు మంత్రులు, 40మంది పాత్రికేయుల సహా మొత్తం 300 మందికిపైగా ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాకే చేసినట్లు ఓ మీడియా సంస్థ.. ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇదీ చూడండి: పంజాబ్‌లో 'టీ పాలిటిక్స్'- వివాదానికి తెరపడినట్టేనా?