ETV Bharat / bharat

YS viveka case దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు.. మరో పిటిషన్​పై ఈనెల 25కు విచారణ వాయిదా - సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు

viveka murder case : ఓ వైపు సీబీఐ కస్టడీలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి విచారణ.. మరో వైపు దస్తగిరిని అప్రూవర్​గా అనుమతించొద్దని సహ నిందితులు... ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ల రద్దుపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇరు వర్గాల వాదన.. ఇంకో వైపు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ వివేకా కూతురు సునీత... వెరసి వైఎస్ వివేకా హత్య కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హత్య కేసును త్వరగా ముగించాలన్న సీబీఐ సిట్.. తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 20, 2023, 5:15 PM IST

viveka murder case : దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ జూన్ మూడో వారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు ఇచ్చింది.

గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని... ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 25కి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా.. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాగేంద్ర, అనిల్ వాదనలు వినిపించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరిన సీబీఐ.. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలకం అని తెలిపింది. హత్యకు కుట్ర చేయడంతో పాటు హతమార్చడంలో గంగిరెడ్డిది కీలకపాత్ర అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించి సిట్ ఛార్జిషీట్ వేయనందునే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందని వాదించిన సీబీఐ తరఫు న్యాయవాదులు.. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. హత్య వెనక దాగి ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ నెల 25న వాదనలు.. ఇక.. గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు తన వాదనలు వినిపిస్తూ.. అన్నీ పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ రద్దుకు నిరాకరించిందని అన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్న అనుమానంతో బెయిల్ రద్దు చేయడం తగదని అన్నారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనను సునీత తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్స మర్థించారు. తెలంగాణ హైకోర్టులో ఈనెల 25న వాదనలు కొనసాగనున్నాయి.

రెండోరోజు ముగిసిన విచారణ.. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి రెండో రోజు కస్టడీ ముగిసింది. చంచల్ గూడ జైలు నుంచి తమ కార్యాలయానికి తరలించిన సీబీఐ అధికారులు.. సుమారు ఆరు గంటలపాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిని తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నెల 19 నుంచి 24 వరకూ సీబీఐ అధికారులు ఈ ఇద్దరు నిందితులను తమ అదుపులోనే ఉంచుకోవచ్చు. అంటే కోఠి సీబీఐ కార్యాలయంలో నిందితులను ఉంచే సెల్లో ఉంచవచ్చు. కస్టడీ ముగిసిన తర్వాత అంటే.. 24వ తేదీన న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించాల్సి ఉంటుంది. కానీ ఆనారోగ్యంతో ఉన్న భాస్కరరెడ్డిని తమ వద్ద ఉంచుకోవడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో ఏరోజుకారోజు జైలుకు తరలించి మళ్లీ మర్నాడు ఉదయం విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి తీసుకొని రావాలని అధికారులు నిర్ణయించారు.

సుప్రీంలో సవాలు చేసిన సునీత... వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్​ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించడం విదితమే. ఈ నెల 25న తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించగా.. హైకోర్టు నిర్ణయాన్ని సునీత సుప్రీంలో సవాలు చేశారు. అవినాష్​రెడ్డిని ఈనెల 25వరకు అరెస్ట్​ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ... వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్​ ముందస్తు బెయిల్​ వ్యవహారంపై.. సుప్రీం ధర్మాసనం ముందు సునీత తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిటిషన్‌పై ఈ నెల 21న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వెల్లడించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.