ETV Bharat / bharat

ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 'పశువుల దాణా'! - మధ్యాహ్న భోజనంలో పశుగ్రాసం

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సామగ్రికి బదులుగా పశువుల దాణా దర్శనమిచ్చింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని స్థానిక మున్సిపల్​ కార్పొరేషన్ మేయర్​ అన్నారు. దీనిపై విచారణ జరిపించి.. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

A Govt school in Pune received cattle fodder, instead of mid-day meal for students
ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి 'పశుగ్రాసం'!
author img

By

Published : Mar 19, 2021, 8:43 PM IST

Updated : Mar 19, 2021, 10:08 PM IST

మహారాష్ట్ర పుణె హడ్​పసర్​లోని ఓ మున్సిపల్​ పాఠశాలలో అనూహ్య ఘటన జరిగింది. అధికారులు మధ్యాహ్న భోజన పథకం కింద.. పశువుల దాణా పంపడం తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతంలో ఐదు మున్సిపల్​ పాఠశాలలు సహా.. మొత్తం 58 స్కూళ్లు ఉన్నాయి. ఆయా స్కూళ్లకు పంపే ఆహారంలో 40 బస్తాలు నాసిరకంగా( పశువుల దాణా) ఉందని అధికారులు తెలిపారు. దీన్ని గమనించిన అక్కడి ఎన్సీపీ కార్యకర్త.. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు.

A Govt school in Pune received cattle fodder, instead of mid-day meal for students
నాసిరకం ధాన్యం

లాక్​డౌన్​ కారణంగా.. గతేడాది మూతపడ్డ పాఠశాలలు.. కొద్దిరోజుల క్రితమే తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆహారం సరఫరా చేయగా.. ఇలా పశువుల దాణా, నాసిరకం ధాన్యం పంపినట్టు తేలింది. ఈ ఘటనపై స్పందించిన ఎఫ్​డీఐ(భారత ఆహార సంస్థ).. వీటన్నిటినీ జప్తు చేసింది. తదుపరి చర్యలు చేపడతామని చెప్పింది.

పశువు చిత్రాలు కలిగిన ఆహార బస్తాలు

ధాన్యపు బస్తాలను పరిశీలిస్తున్న అధికారులు

ఈ ఘటనను చాలా దురదృష్టకరంగా అభిప్రాయపడ్డారు స్థానిక మేయర్​. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎఫ్​డీఐని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 20ఏళ్లుగా వానరాల ఆలనా పాలనే ఆమె దినచర్య

Last Updated : Mar 19, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.