ఓ శాడిస్టు భర్త తాగిన మత్తులో తన భార్య ముక్కు కొరికేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ్ జిల్లాలో జరిగింది.
ధార్వాడ్లోని అమ్మినబావి గ్రామానికి చెందిన ఉమేశ్, గీత దంపతుల మధ్య చాలాకాలంగా మనస్పర్థలున్నాయి. దీంతో గీత.. తన కన్నవారింటికి వెళ్లిపోయింది. అయితే ఫూటుగా తాగి అక్కడి వెళ్లిన ఉమేశ్.. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే కిరాతకంగా ఆమె ముక్కును కొరికేశాడు. అనంతరం అత్తపై కూడా దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకులు వేయడం వల్ల అక్కడి నుంచి పరారయ్యాడు.
గాయపడిన గీతను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కరోనా ఒత్తిడిని దూరం చేసే నృత్యం.. ట్రై చేశారా?