ETV Bharat / bharat

సుప్రీంకోర్టు ఎదుట చొక్కా విప్పి.. జడ్జి నిరసన - బట్టల్లేకుండా జడ్జి నిరసన

సుప్రీంకోర్టు ఎదుట ఓ జిల్లా కోర్టు న్యాయమూర్తి వింతగా నిరసన తెలిపారు. తన చొక్కా విప్పి, అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనకు దిగారు. ఓ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఇలా (District court judge protest at suprme court) చేసినట్లు తెలుస్తోంది.

district court judge protest at supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Nov 23, 2021, 4:40 PM IST

దిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం గేటు బయట అనూహ్య ఘటన జరిగింది. ఓ జిల్లా కోర్టు న్యాయమూర్తి(District judge took off his clothes) తన చొక్కా విప్పి, నిరసనకు దిగారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

ఆరా తీస్తే..

సుప్రీంకోర్టు మెయిన్ గేటు బయట సోమవారం.. ఓ వ్యక్తి అర్ధనగ్నంగా నిరసిస్తూ కూర్చోవడాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించారు. ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే.. అప్పుడు వారు నిరసన చేస్తున్న వ్యక్తి... ఓ జిల్లా కోర్టుకు జడ్జి అని గుర్తించారు. ఆయనను తన నిరసన నిలిపివేయాలని అభ్యర్థించారు. అయినప్పటికీ వారి మాట వినకుండా.. ఆ జడ్జి చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఆఖరికి అక్కడున్నవారు ఎంతో బతిమాలగా ఆయన తన చొక్కా ధరించి.. నిరనసను విరమించారు.

అయితే.. అధికారులు ఆయన నిరసనకు కారణమేంటో వివరించేందుకు నిరాకరించారు. అది ఆ జడ్జి వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఓ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఈ నిరసన చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'తల్లి'డిల్లిన మాతృహృదయం- దూడను ఎత్తుకెళ్తున్నారని..

ఇదీ చూడండి: డోలు వాయిస్తూ.. డ్యాన్స్​తో సీఎం సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.