ETV Bharat / bharat

బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం! - బొడోకెందుగుడ

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలహండి నుంచి హైదరాబాద్​ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

bus overturned
బస్సు బోల్తా-20 మంది పరిస్థితి విషమం!
author img

By

Published : Dec 13, 2020, 10:18 PM IST

ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కోక్‌సొర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొడోకెందుగుడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 40 మందికి గాయాలవ్వగా.. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

a bus accident in odisha 40 people injured 20 people in serious condition
ధర్మాఘర్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న బస్సు బోల్తా

బోల్తాపడిన బస్సు

క్షతగాత్రులను అంబులెన్స్​లోకి ఎక్కిస్తున్న స్థానికులు

గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్న స్థానికులు

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. భారీ మలుపును డ్రైవర్‌ గుర్తించలేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి:ఆరో అంతస్తులో పనిమనిషి నిర్బంధం-జారిపడి మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.