ETV Bharat / bharat

ప్రమాదంలో ఒకరు.. పశ్చాత్తాపంతో మరొకరు.. - కర్ణాటక పీహెచ్​డీ విద్యార్థి ఆత్మహత్య

ట్రాక్టర్ ప్రమాదంలో చిన్నారి మరణించాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్, పీహెచ్​డీ విద్యార్థి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

accident
ప్రమాదంలో ఒకరు.. పశ్చాతపంతో మరొకరు..
author img

By

Published : Jul 9, 2021, 5:46 PM IST

ట్రాక్టర్​ ప్రమాదంలో మరణించిన చిన్నారి తనవల్లే మృతిచెందాడన్న కుంగుబాటుతో మైసూర్ విశ్వవిద్యాలయంలో పీహెచ్​డీ చేస్తున్న సునీల్ (23) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్ణాటక చామరాజనగర జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

accident
ప్రమాదంలో మృతిచెందిన చిన్నారి హర్ష

ఇదీ జరిగింది..

జిల్లాలోని గుండ్లుపేటే తాలూకా సవకనహళ్లి పల్య గ్రామంలో నిర్వహించబోయే క్రికెట్ టోర్నమెంట్ కోసం ట్రాక్టర్​తో మైదానాన్ని చదును చేస్తున్నాడు సునీల్. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న హర్ష అనే చిన్నారికి పొరపాటున ట్రాక్టర్‌ తగిలింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గుండ్లుపేటే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

accident
ట్రాక్టర్ నడిపిన పీహెచ్​డీ విద్యార్థి సునీల్..

ఈ ఘటన అనంతరం సునీల్ తిరిగి మైసూర్ వెళ్లాడు. అయితే.. చిన్నారి మరణవార్త విని పశ్చాత్తాపంతో తన గదిలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించి ఏ పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.