ETV Bharat / bharat

బోరుబావి నుంచి బాలుడు బయటకు.. NDRF ఆపరేషన్​ సక్సెస్..​ హుటాహుటిన ఆస్పత్రికి! - బోరుబావిలో పడ్డ బాలుడు

Boy Fell In Borewell : ఆడుకుంటూ వెళ్లి 300 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఏడు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు ఎట్టకేలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశాయి.

9-year-old-child-fell-into-a-300-feet-deep-borewell-pit-in-jaipur

author img

By

Published : May 20, 2023, 3:17 PM IST

Updated : May 20, 2023, 6:37 PM IST

Boy Fell In Borewell : రాజస్థాన్​లో 9 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిన ఘటనలో సహాయక బృందాల శ్రమ ఫలించింది. ఏడు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు ఎట్టకేలకు లక్కీని సురక్షితంగా బయటకు తీశాయి. లక్కీ 300 అడుగుల లోతైన బావిలో 70 అడుగుల లోతున చిక్కుకున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ తెలిపింది.

గ్రామస్థుల కథనం ప్రకారం.. జయపుర జిల్లాలోని భోజ్​పురా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ శివార్లలో ఉన్న బోరుబావి చాలా కాలంగా మూసి ఉంది. గ్రామస్థులు ఆ బోరుబావిని రాయితో కప్పివేశారు. అయితే శనివారం ఉదయం గ్రామంలోని కొందరు పిల్లలు ఆడుకుంటా ఆ బోరుబావి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత అనుకోకుండా ఆ రాయిని తొలగించారు. ఆ సమయంలో అక్షిత్​ అలియాస్​ లక్కీ అనే బాలుడు.. ఉదయం 7 గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు.

చిన్నారి బోరుబావిలో పడిన సమాచారం అందుకున్న గ్రామస్థులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, ఎన్డీఆర్​ఎఫ్​ అధికారులు బోరుబావి వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావి దాదాపు 300 అడుగుల లోతు ఉన్నట్లు సమాచారం. బోరుబావి లోపలి నుంచి బాలుడి శబ్దం వినిపిస్తోందని అధికారులు తెలిపారు. 7 గంటలు నిర్విరామంగా శ్రమించి బాలుడిని బయటకు తీసింది ఎన్​డీఆర్ఎఫ్​ బృందం. వెంటనే ఆ బాలుడిని స్థానిక ఆస్పత్రికి అధికారులు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు.

బోరుబావిలో పడ్డ 9ఏళ్ల బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి 300 అడుగుల లోతులో..

50 అడుగుల బావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు.. 104 గంటలు శ్రమించి..
ఛత్తీస్​గఢ్​లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో కొన్నిరోజుల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 12 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 104 గంటల శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బాలుడిని బయటకు తీశారు అధికారులు. ప్రత్యేక అంబులెన్స్​లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని మాల్ఖరోదా పోలీస్​స్టేషన్​ పరిధిలోని పిహరీద్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంటివద్ద ఆడుకుంటూ రాహుల్​ అనే బాలుడు వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వెతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే 112కు ఫోన్​ చేసి సమాచారం అందించారు. దాదాపు 104 గంటల శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్​లో బిలాస్‌పుర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఆ ఘటనా సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర బఘేల్​ కూడా రంగంలోకి దిగారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాలుడిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారు.

Last Updated : May 20, 2023, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.