ETV Bharat / bharat

9 నెలల ఇరాక్​ పసికందుకు దిల్లీ వైద్యుల పునర్జన్మ! - delhi hospital baby liver transplantation

దిల్లీ వైద్యులు.. 9 నెలల ఇరాక్​కు చెందిన ఓ చిన్నారి ప్రాణాలు కాపాడారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సర్జరీ చేసేందుకు 9 గంటల పాటు వైద్యులు శ్రమించారు.

baby liver transplanation
9 నెలల ఇరాక్​ పసికందుకు.. దిల్లీ వైద్యుల పునర్జన్మ!
author img

By

Published : Feb 7, 2021, 8:28 PM IST

ఓ 9 నెలల పసికందు ప్రాణాలను దిల్లీ వైద్యులు కాపాడారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఛాలెంజ్​గా స్వీకరించి..

కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఇరాక్​కు చెందిన 9 నెలల చిన్నారి హమద్​కు జనవరి 3న కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. అంత చిన్న వయస్సువారికి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం అత్యంత క్లిష్టమైన పని. కానీ, దీన్ని మణిపాల్​ ఆసుపత్రి వైద్యులు ఛాలెంజ్​గా స్వీకరించి, చిన్నారిని కాపాడారు. డాక్టర్​ శైలేంద్ర లాల్వానీ నేతృత్వంలోని వైద్య బృందం 9 గంటల పాటు శ్రమించి ఈ సర్జరీని పూర్తి చేసింది.

హమద్​ కంటే ముందు వారికీ..

హమద్​కు తన తల్లి.. కాలేయాన్ని దానం చేసిందని వైద్యులు తెలిపారు. జనవరి 26న హమిద్​ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగుందని తెలిపారు. హమద్​ కంటే ముందు జన్మించిన మగ్గురు చిన్నారులు కూడా ఇదే వ్యాధితో బాధపడే వారు. సరైన చికిత్స అందక ఆ ముగ్గురు మృతి చెందారు. అయితే.. ప్రస్తుతం దిల్లీ వైద్యుల కృషి ఫలితంగా హమద్​ను కాపాడుకోగలిగామని తన తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:ఆ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.