ETV Bharat / bharat

ఆకాశ్​ క్షిపణిపై 9 దేశాల ఆసక్తి! - ఆకాశ్​ క్షిపణి అమ్మకం

ఆకాశ్​ ఎయిర్​ డిఫెన్స్​ మిస్సైల్​ వ్యవస్థను కొనేందుకు 9 మిత్ర దేశాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర కేబినేట్​ ఆమోదం లభించగానే క్షిపణి విక్రయ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాయి.

9 countries interested in acquisition of DRDO-developed Akash air defence missile system
'ఆకాశ్​ ఎయిర్​ క్షిపణిని కొనడానికి 9 దేశాల ఆసక్తి'
author img

By

Published : Dec 31, 2020, 6:54 AM IST

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) తయారుచేసిన ఆకాశ్​ ఎయిర్​ డిఫెన్స్​ మిస్సైల్​ వ్యవస్థను కొనుగోలు చేయడానికి తొమ్మిది ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర కేబినేట్​ ఆమోదం తెలిపిన తర్వాత ఈ మిస్సైల్స్​ ను విక్రయించడానికి ఏర్పాట్లు మొదలు కానున్నట్లు వెల్లడించాయి.

5 బిలియన్ డాలర్ల రక్షణ రంగ ఆయుధాల ఎగుమతికి బుధవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మిత్ర దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతం కోసం ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి.

స్వదేశంలో తయారైన ఈ క్షిపణులు 2015 నుంచి భారత అమ్ములపొదిలో కీలకంగా ఉన్నాయి. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వీలున్న ఈ​ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

సముద్ర నిఘా వ్యవస్థలో, రాడార్​, గగనతల రక్షణ మార్గంలోనూ మెరుగైన క్షిపణులను తీసుకురానున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: ఆకాశ్ క్షిపణి ఎగుమతికి కేబినెట్ పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.