ఓ వృద్ధురాలి కంటిలో నుంచి 9 సెంటిమీటర్ల పొడవుతో బతికి ఉన్న కీటకాన్ని వైద్యులు బయటకు తీశారు. ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో జరిగింది.
అసలేమైందంటే..
కంటినొప్పితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలు.. జూన్ 1న చికిత్స కోసం ఉడుపిలోని ప్రసాద్ నేత్రాలయకు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె కంటిలో సజీవంగా ఉన్న ఓ కీటకం ఉన్నట్లు గుర్తించారు. కీటకం కదలికలను కట్టడి చేసేలా ఔషధాన్ని అందించి ఆమెను ఇంటికి పంపించారు.


కానీ, తీవ్రమైన కంటినొప్పి, మంట వేధించగా.. సోమవారం మళ్లీ ఆమె ఆస్పత్రికి చేరుకున్నారు. దాంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. కంటిలోపలి పొర నుంచి కీటకాన్ని బయటకు తీసి.. వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ పురుగుపై మరిన్ని పరిశోధనల కోసం లేబొరేటరీకి పంపించారు.
ఇదీ చూడండి: కుర్రాడికి ఆస్పత్రి ఫోన్.. మీరు చనిపోయారంటూ...
ఇదీ చూడండి: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్స్ విక్రయం!