ETV Bharat / bharat

ఆ గ్రామంలో 2 వారాల్లోనే 87 పందులు మృతి.. కారణం? - ఏఎస్​ఎఫ్​ వ్యాధి

మిజోరంలోని బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతం లుంగలేయీ జిల్లాలో రెండు వారాల్లోనే 80పైగా పందులు మృతి చెందటం కలకలం రేపింది. ఆఫ్రికన్​ స్వైన్ ఫ్లూ​ (ఏఎస్​ఎఫ్​) వ్యాప్తి చెందిందేమోనని అనుమానంతో ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు. సుమారు రూ.40 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

Pigs die in Mizoram
పందులు మృతి
author img

By

Published : Apr 5, 2021, 5:34 AM IST

మిజోరం లుంగలేయీ జిల్లాలోని ఓ గ్రామంలో పందుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్​ సరిహద్దుకు సమీపంలోని లుంగసెన్​ గ్రామంలో రెండు వారాల్లోనే 87 పందులు మృతి చెందాయి. దీంతో రూ.40 లక్షల నష్టం వాటిల్లున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాలకు కారణామేంటన్నది ఇంకా తెలియలేదు. ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ ​(ఏఎస్​ఎఫ్​)తోనే పందులు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏఎస్​ఎఫ్​ అనుమానంతో ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు.

మార్చి 21న తొలి మరణం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎలిసా, పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. క్లాసికల్​ స్వైన్​ ఫ్లూ, పోర్​సైన్​ రీ ప్రొడక్టివ్​ అండ్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​ వ్యాధులు లేవని వైద్యులు నిర్ధరించారు. మధ్యప్రదేశ్‌లోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హై సెక్యూరిటీ యానిమల్​ డిసీజెస్​ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)లో ఏఎస్‌ఎఫ్‌ నిర్ధరణ పరీక్షలు చేపట్టాల్సి ఉందని పశువైద్య నిపుణులు లాల్‌మింగ్‌తంగా తెలిపారు. వెటర్నరీ సైన్స్​ అండ్​ యానిమల్​ హస్బెండరీ కళాశాలలో ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏఎస్​ఎఫ్​పై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్​ 2న 144 సెక్షన్​ విధించారు. లుంగ్​సెన్​ గ్రామాన్ని వ్యాధి​ కారక ప్రాంతంగా ప్రకటించారు.

ఇదీ చూడండి: సీడీ కేసులో ట్విస్ట్​- మాజీ మంత్రికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.