దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 9మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 82కు పెరిగింది.
బాధితులందరూ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో సింగిల్రూమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆ 10 రాష్ట్రాల్లోనే...
భారత్లో రోజువారీ నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లోనే 81.22 శాతం బాధితులు ఉన్నారని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటిల్లో కేరళ(గురువారం 5,051 కేసులు) ప్రథమ స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర(3,729 కేసులు), ఛత్తీస్గఢ్(1,010 కేసులు) తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి