ETV Bharat / bharat

తండ్రి శవంతో రెండు రోజులుగా ఇంట్లోనే చిన్నారి

కరోనాతో చనిపోయిన తండ్రి వద్ద 8ఏళ్ల కూతురు రెండు రోజుల పాటు ఉంది. ఈ ఘటన బిహార్​లోని పాట్నాలో జరిగింది. సీపీఎం ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకొని.. అంత్యక్రియలు నిర్వహించారు.

CORONA
కరోనా
author img

By

Published : Apr 29, 2021, 4:10 PM IST

కరోనా మహమ్మారితో మానవత్వమే చచ్చిపోతోంది. వైరస్​తో మృతి చెందితో.. కుటుంబ సభ్యులే దూరంగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. బిహార్​లోని పట్నాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కరోనాతో తండ్రి చనిపోవటం వల్ల ఎనిమిదేళ్ల కూతురు రెండు రోజులు మృతదేహంతోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎవరూ దగ్గరకు రాకపోవటం వల్ల స్థానిక ఎమ్మెల్యే స్పందించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ జరిగింది..

కొన్నేళ్ల క్రితం 45 ఏళ్ల ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి నలంద నుంచి పాట్నాకు వచ్చాడు. అక్కడే పనులు చేసుకుంటున్నాడు. కాగా ఇటీవల ఆయనకు కరోనా సోకింది. వ్యాధి తీవ్రమై అతను చనిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఎవరూ దగ్గరకు రాకపోవటం వల్ల రెండు రోజుల పాటు శవం ఇంట్లోనే ఉంది. ఎనిమిదేళ్ల కూతురు శవంతో బిక్కుబిక్కు మంటు గడిపింది.

ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. అయినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సాయం అందలేదు. విషయం తెలుసుకున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, పుల్వారి ఎమ్మెల్యే గోపాల్​ రవిదాస్​ సంఘటనా స్థలానికి చేరుకుని సాయం అందించారు. మృతదేహాన్ని శ్మశానికి చేర్చి అంత్యక్రియలు జరిపించారు.

ఇదీ చదవండి: 24 గంటల పాటు కొవిడ్ రోగుల మధ్యే మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.