బిహార్ నలంద జిల్లాలో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో హోటల్ సిబ్బంది సహా.. కస్టమర్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు.
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని డీఎస్పీ కృష్ణ మురారీ శరణ్ తెలిపారు.
స్థానికుల ఆగ్రహం..
ఈ ఘటనపై ఆగ్రహం చెందిన స్థానికులు ప్రమాదానికి కారణమైన వాహనానికి నిప్పంటించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించారు అధికారులు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.4 లక్షల పరిహారాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఇదీ చదవండి: యూపీ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం