ETV Bharat / bharat

75 ఏళ్ల సూపర్ ఉమన్​.. 10వేల కిలోమీటర్లు సైకిల్​పైనే సవారీ

వయసు 75 ఏళ్లు అయినా.. సైక్లింగ్​లో మాత్రం ఆమెకు ఆమే సాటి. మలి వయసులో సైతం.. సైకిల్‌పై భారతదేశాన్ని చుట్టి ఆశ్చర్యపరిచారామె. ఏకంగా 10వేల కిలోమీటర్లు ప్రయాణించి.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

నిరుపమా భావే
Nirupama bhave
author img

By

Published : Mar 31, 2022, 1:00 PM IST

Updated : Mar 31, 2022, 1:57 PM IST

Women Travels 10,000km On Cycle: సైకిల్​పై 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు పుణెకు చెందిన మహిళ. 75 ఏళ్ల వయసులోనూ ఇటీవల 16 రోజుల వ్యవధిలోనే పుణె నుంచి సుందర్‌బన్‌కు 2,100 కి.మీ. ప్రయాణించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. మీ స్కూటర్‌కు రెండు రోజులు విరామం ఇవ్వండి.. సైకిల్‌ తొక్కండి అంటూ సందేశమిస్తున్నారు పుణెకు చెందిన నిరుపమా భావే.

Women Travels 10,000km On Cycle:
10 వేల కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించిన మహిళ

భర్తతో పాటు స్థానిక వాడియా కళాశాలలో నిరుపమా ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో భర్త స్నేహితుడు పుణెలోని ఔంధ్‌ నుంచి వాడియాలోని కళాశాలకు సైకిల్‌పై వచ్చేవారు. ఇలా అతను రోజు 14 నుంచి 16 కి.మీ. ప్రయాణించేవాడు. ఇదంతా చూసిన నిరుపమా ఆయన నుంచి స్ఫూర్తి పొంది సైకిల్‌ ప్రయాణం మొదలుపెట్టారు ఇలా.. 54 ఏళ్ల వయసులో ఆమె తొలిసారిగా సైకిల్‌పై వాఘా సరిహద్దు నుంచి ఆగ్రాకు వెళ్లారు. తరువాత ఏడాది భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతాకు, ఆ తర్వాత గోవా నుంచి కొచ్చి వరకు, చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌పై ప్రయాణించారు. తన 70వ పుట్టినరోజు సందర్భంగా పుణె నుంచి కన్యాకుమారి వరకు కేవలం 16 రోజుల్లోనే సైకిల్‌పై వెళ్లారు. 72వ జన్మదినం పురస్కరించుకుని జమ్మూ-కశ్మీర్‌ వరకు పర్యటన సాగించారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 10,000 కి.మీ. ప్రయాణం సాగించారు. ఇప్పుడు కూడా. పుణెలోని ఏ ప్రదేశానికి వెళ్లాలనుకున్నా నిరుపమా సైకిల్‌నే వినియోగించడం విశేషం.

Women Travels 10,000km On Cycle:
సహచరులతో నిరుపమా భావే

ఇదీ చదవండి: శతాధిక వృద్ధుడి ఆరోగ్య రహస్యం.. కోరికల్ని నియంత్రిస్తే సమస్యలు దూరం

Last Updated : Mar 31, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.