ETV Bharat / bharat

Second Wave: 730మంది వైద్యులు బలి!

కరోనా సెకండ్​ వేవ్​లో దేశవ్యాప్తంగా 730మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్ (IMA) తెలిపింది. దిల్లీలో 109 మంది, బంగాల్​లో 62మంది చనిపోయినట్లు వెల్లడించింది.

author img

By

Published : Jun 16, 2021, 11:01 PM IST

COVID-19
730మంది వైద్యులు బలి

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయంతో దేశవ్యాప్తంగా 730మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్ (IMA) వెల్లడించింది. కేవలం ఒక్క బిహార్‌లోనే 115 మంది చనిపోగా, దిల్లీలో 109 మంది డాక్టర్లు కరోనా మహమ్మారికి బలయ్యారని తెలిపింది. ఇక తొలిదశ విజృంభణ సమయంలోనూ కరోనా కారణంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ రిజిస్ట్రీలో పేర్కొంది.

సెకండ్‌ వేవ్‌ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో 79, పశ్చిమ బెంగాల్‌లో 62, రాజస్థాన్‌లో 43, ఝార్ఖండ్‌లో 39, ఆంధ్రప్రదేశ్‌లో 38 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ వెల్లడించింది. ఇలా దేశవ్యాప్తంగా కేవలం సెకండ్‌ వేవ్‌ సమయంలో ఇప్పటివరకు మొత్తం 730 మంది వైద్యులు మరణించారని పేర్కొంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు, కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్న మహారాష్ట్రలో 23 మంది వైద్యులు మృతిచెందారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న కర్ణాటకలోనూ 9మంది చనిపోయారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 24గంటల్లో దాదాపు 20లక్షల కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 62వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2542 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 3లక్షల 79వేలు దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉంది.

ఇదీ చదవండి: 'టీకా బూస్టర్​ డోస్​పై ముమ్మర పరిశోధనలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.