కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా భండారిబెట్టు ప్రాంతంలో 72 ఏళ్ల వృద్ధురాలు పరీక్షకు హాజరై అందరికీ ఆదర్శంగా నిలిచారు. కర్ణాటక రాష్ట్ర తులు సాహిత్య అకాడమీ, జైతులు ఆర్గనైజేషన్, భండారిబెట్టు యువజన వ్యాయామ శాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తులు రాత పరీక్ష రాశారామె.
పానేమంగళూరు ప్రాంతానికి చెందిన ఎన్బీ లక్ష్మీ అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల నెల రోజుల క్రితం తులు భాషపైన నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్ పాఠాలు విన్నారు.
తులు భాష పరీక్షకు హాజరవడం ద్వారా లక్ష్మీ అందరికీ ఆదర్శంగా నిలిచారని పరీక్ష నిర్వహకులు పేర్కొన్నారు.
భండారిబెట్టు సహా కెడిలా, పేర్నికి చెందిన మొత్తం 83 మంది విద్యార్థులు ఈ తులు రాత పరీక్షల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 88 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా ఎన్నికైన బామ్మ