ETV Bharat / bharat

ఏడు రాష్ట్రాలకు విస్తరించిన 'బర్డ్​ ఫ్లూ' - ఏడు రాష్ట్రాలకు బర్డ్​ఫ్లూ

దేశంలో 'బర్డ్ ​ఫ్లూ' వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో ఇది విస్తరించినట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

BIRD FLU
ఏడు రాష్ట్రాలకు విస్తరించిన 'బర్డ్​ఫ్లూ'
author img

By

Published : Jan 9, 2021, 7:39 PM IST

Updated : Jan 9, 2021, 8:47 PM IST

దేశంలో ఏడు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ విస్తరించినట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూను నిర్ధరించినట్లు కేంద్ర పాడి పశు సంవర్థక మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఛత్తీస్‌గఢ్​లో అకారణంగా పక్షులు మరణించినట్లు నివేదిక అందిందని తెలిపింది కేంద్ర పాడి పశు సంవర్థక మంత్రిత్వశాఖ. దిల్లీ మయూర్‌ విహార్‌ సంజయ్ లేక్​లో బాతులు అకారణంగా మృతి చెందిన విషయం కూడా తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోనూ బర్డ్​ ఫ్లూ వ్యాప్తి ఆనవాళ్లున్నట్లు పేర్కొంది. ముంబయి, ఠాణే, దపోలీ, పర్భానీ ప్రాంతాల్లో కాకులు మరణించాయనే సమాచారం అందినట్లు తెలిపింది.

ఛత్తీస్​గఢ్, దిల్లీ రాష్ట్రాల్లో మరణించిన పక్షులు, బాతులలో ఏవియన్ ఇన్‌ ఫ్లూయెంజా వైరస్ ఆనవాళ్ల కోసం నమూనాలను పరీక్షలకు పంపినట్లు పశు సంవర్థక శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం కోరింది.

ఇదీ చదవండి:

దిల్లీలో మరణిస్తున్న పక్షులు- ప్రభుత్వం ఆంక్షలు

ఆందోళన వద్దు - ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్ ఫ్లూ!

Last Updated : Jan 9, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.